Tenth Class Paper Leak Case: Key Points Revealed In Accused Remand Reports, Details Inside - Sakshi
Sakshi News home page

Tenth Paper Leak: పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు.. తెలిసిన వారి కోసమే పంపారు!

Apr 4 2023 7:50 PM | Updated on Apr 4 2023 8:18 PM

Telangana 10th Class Paper Leak Case Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి.  తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్‌ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు.  

పొరపాటున మరో వాట్సాప్‌ గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని,  అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు.

ఆన్సర్‌ పేపర్ మిస్సింగ్‌.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు..
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్‌ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు.  ఆన్సర్ పేపర్  మిస్సింగ్‌కు కారణమైన  ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.  పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్‌), నాగరాజు(ఔట్ సోర్సింగ్‌)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.
చదవండి: పేపర్‌ లీక్‌ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement