తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ

Swamy Ramananda Tirtha Rural Institute Technical Training for Unemployed Youth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్‌–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్‌ (డొమెస్టిక్‌), సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్ట లేషన్, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్‌బ్యాగ్స్‌ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు.

అర్హతలు
► వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి

► ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు.

► అర్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ సెట్, పాస్‌పోర్ట్‌ ఫొటోలు, ఆధా, రేషన్‌కార్డులు

ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈనెల 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌ పూర్‌ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్‌ కిశోర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: బస్‌పాస్‌ చార్జీలు భారీగా పెంపు?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top