రూఫ్‌టాప్‌ సోలార్‌కు రూ.78 వేల వరకు సబ్సిడీ | Subsidy of up to Rs 78000 for rooftop solar | Sakshi
Sakshi News home page

రూఫ్‌టాప్‌ సోలార్‌కు రూ.78 వేల వరకు సబ్సిడీ

Oct 11 2026 5:08 AM | Updated on Oct 11 2026 5:08 AM

Subsidy of up to Rs 78000 for rooftop solar

పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌పీడీసీఎల్‌ విజ్ఞప్తి  

సాక్షి, హైదరాబాద్‌: గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ లిమిటెడ్‌ (టీజీఎస్‌పీడీసీఎల్‌) విజ్ఞప్తి చేసింది. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు 3 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.78,000 కేంద్ర సబ్సిడీ పొందవచ్చు.

గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఉమ్మడి సౌకర్యాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ వంటి అవసరాల కోసం ఏర్పాటుచేసే రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలకు కూడా నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. ఈ విభాగంలో కిలోవాట్‌కు రూ.18,000 చొప్పున, గరిష్టంగా 500 కిలోవాట్ల సామర్థ్యం వరకు.. అంటే ఒక్కో ఇంటికి 3 కిలోవాట్ల పరిమితికి అనుగుణంగా సహాయం అందుతుంది.

పథకం కింద సబ్సిడీ పొందాలంటే దేశీయంగా తయారైన సోలార్‌ సెల్స్‌తో రూపొందించిన మాడ్యూల్స్‌ వినియోగించడం సహా నిర్దేశిత నిబంధనలను పాటించాలి. వినియోగదారులు పీఎం సూర్య ఘర్‌ అధికారిక వెబ్‌సైట్‌  https://pmsuryaghar.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు’ అని టీజీఎస్‌పీడీసీఎల్‌ వివరించింది. 2026 అక్టోబర్‌ 9 నాటికి టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో నెట్‌ మీటరింగ్‌ విభాగంలో 640.8 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement