breaking news
rooftop solar energy
-
రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి పొందాయి. ప్రారంభం నుంచి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం పతాకస్థాయిలో ఆదరణ పొందినట్లు పేర్కొంది.పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు పదేళ్లలో.. దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కుటుంబాలు సోలార్‌ను స్వీకరించాయి. దీన్నిబట్టి చూస్తే.. ప్రజల్లో అవహగాన పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.ఒక్క నెలలోనే 5.06 లక్షలుప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు లక్ష మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరుతున్నట్లు సమాచారం. గత తొమ్మిది నెలల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు వేగం మూడు రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా 2026 జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు కావడం ఒక కొత్త రికార్డు. రోజుకు సగటున 16 వేలకుపైగా ఇళ్లలో సోలార్ వ్యవస్థలు అమర్చడం ఈ కార్యక్రమం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో తెలియజేస్తోంది.ఈ పథకం వల్ల ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఫలితంగా సుమారు 19 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లు లేకుండానే జీవిస్తున్నాయి.అదనపు ఆదాయం కూడా..అంతేకాదు.. అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబాలు కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందగా, ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం వచ్చింది.ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ చేసింది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందుతున్నారు. కాగా.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి.A people-powered solar revolution is transforming India. Under Hon'ble PM Shri @narendramodi ji’s @PMSuryaGhar Muft Bijli Yojana, 50 lakh families are harnessing the power of the sun for cleaner energy, lower electricity bills, and a brighter tomorrow. #50LakhPMSuryaGhar pic.twitter.com/dhRgyDvnhI— Ministry of New and Renewable Energy (MNRE) (@mnreindia) August 4, 2026 -
ఎనర్జిటిక్ ఉమెన్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మల్లిఖేడ గ్రామం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గ్రామాలలో ఇదొకటి. చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా డీజిల్‌ను ఎంచుకునేవారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె పేరు సుమన్. భర్త చిన్నపాటి ఉద్యోగమేదో చేస్తాడు. తక్కువ ఆదాయం కారణంగా, కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్నపాటి షాపు నిర్వహిస్తోంది సుమన్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రింటింగ్, ఫొటో కాపీయింగ్, ఆధార్ అనుసంధాన సేవలను అందిస్తోంది. కరెంట్ సమస్య...నెత్తి మీద కత్తి!కరెంట్ సమస్య వల్ల ఆమె షాప్ సరిగ్గా నడిచేది కాదు. రోజూ ఎంతోమంది కస్టమర్లు వచ్చినా, కరెంట్ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు...ఊళ్లో జరిగిన గ్రామసభలో పాల్గొంది సుమన్. ఆ సభలో కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టింది. ‘సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఏ సమస్యా ఉండదు’ అని సూచించారు అధికారులు.స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా సోలార్ సిస్టమ్‌కు చేరువైంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి కరెంట్ కష్టాలు లేవు. సుమన్‌కు నెలవారీ ఆదాయం పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ భయపెట్టడం లేదు. ఎంతో కొంత డబ్బు పొదుపు చేయగలుగుతోంది.త్రిబుల్ ఫ్రేమ్వర్క్భారతదేశ ఇంధనరంగంలో మహిళల భాగస్వామ్యం 22 శాతమే. అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోంది. సౌర, పవన ఇంధనంతో పాటు ఇతర ఇంధనాలకు సంబంధించి సాంకేతిక కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.‘మన దేశంలో పునరుత్పాదక శక్తి ఇంజినీరింగ్‌కు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సు లేదు. మనం పూరించాల్సిన లోటు ఇది’ అంటున్నారు లూమినస్ పవర్ టెక్నాలజీ ఎండీ ప్రీతీ బజాజ్.‘మహిళలకు ఇంధనరంగం గురించి అవగాహన కలిగించాలి. ఈ రంగంలో ఉండే అద్భుతమైన కెరీర్ అవకాశాలను గురించి వివరంగా తెలియజేయాలి’ అంటారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌లో సీఎస్ఆర్ విభాగ అధిపతి భావన కృపాల్. ఇంధన రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి 3 ఉ ఫ్రేమ్‌వర్క్ గురించి చెబుతున్నారు ప్రీతి బజాజ్.ఫస్ట్ E–ఎంకరేజర్స్ ( ప్రోత్సాహకులు)నాయకత్వ స్థానాల్లోకి మహిళలు అడుగు పెట్టడానికి ప్రేరేపించే, ప్రోత్సహించే వ్యక్తులు.సెకండ్ E – ఎన్రిచర్స్ (సుసంపన్నం, సారవంతం చేయడం) మహిళల ప్రతిభను గుర్తించి వారి కెరీర్ పురోగతికి మార్గాలు చూపించే సీనియర్లు.థర్డ్ E – ఎంగేజర్స్ (నిమగ్నపరిచేవారు)తమకు ఉన్న విశ్వసనీయతను, ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగించి మహిళలకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి అండగా ఉంటూ, ఉన్నతస్థానాలకు చేర్చడంలో తోడ్పడేవారు.ప్రత్యామ్నాయాల దారిలో...దశాబ్దాల కాలం నుంచి మన ఇంటి వంటకు ఎల్పీజీ వెన్నెముకగా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, సరఫరాకు సంబంధించిన సమస్యలు, పర్యావరణ అవగాహన కారణంగా చాలామంది గృహిణులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు అన్వేషించడం ప్రారంభించారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు.గృహిణులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్ ఒకటి. ఇండక్షన్ స్టవ్‌లు విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి పాత్రలను నేరుగా వేడి చేస్తాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని పట్టణాలలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.మోడ్రన్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు భారతీయ వంటకాల కోసం ముందుగా సెట్ చేసిన మెనూలతో వస్తున్నాయి. దీని వల్ల సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వారికి కూడా వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. అమెరికా– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఆధునిక, పురాతన సంప్రదాయ పద్ధతులను ప్రజలు అనుసరించారు.అవసరంలో ఉన్నప్పుడు ఆవిష్కరణ పుడుతుంది అంటారు. నిన్నామొన్నటి ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం నేపథ్యంలో ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిందా? రెండు దేశాలు కలిసి సామాన్యులపై చేశాయా? అనేది అంతుచిక్కని జవాబు. యుద్ధం వల్ల ఎల్పీజీ సంక్షోభం ఒక కోణం అయితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వెదుక్కోవడం, పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్లడం మరో కోణం. ప్రత్నామ్నాయ ఇంధన వనరుల విషయంలో మహిళలు ముందున్నారు. ఎనర్జిటిక్‌గా ముందుకు వెళుతున్నారు.. -
సోలార్ రూఫ్‌టాప్‌లో టాటా పవర్ రికార్డు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలంలో ఒక గిగావాట్ సోలార్ రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్ల సామర్థ్యాన్ని తన సబ్సిడరీ సంస్థ ‘టాటా పవర్ సోలరూఫ్’ ద్వారా సాధించినట్టు టాటా పవర్ ప్రకటించింది. ఈ కాలంలో 1.7 లక్షల నివాస, వాణిజ్య, పారిశ్రామిక భవనాలపై ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసినట్టు(ఇనస్టలేషన్), అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇన్స్టలేషన్లతో (38,494) పోల్చి చూస్తే 345 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది.ఇదే కాలంలో నివాస, వాణిజ్య, పారిశ్రామిక విభాగంలో లక్ష మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు, దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 3 లక్షలకు, ఇన్స్టాల్డ్ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 4 గిగావాట్లకు పెరిగినట్టు వివరించింది. ఒక్క డిసెంబర్ త్రైమాసికంలోనే 58,476 రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను సాధించినట్టు తెలిపింది.ఏప్రిల్–డిసెంబర్ కాలంలో అత్యధికంగా యూపీలో 30,857, మహారాష్ట్రలో 21,044 ఇన్స్టలేషన్లను చేసినట్టు పేర్కొంది. ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్రయోజనాల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపింది. -
సోలార్.. రాంగ్ బిల్లింగ్!
ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా తన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా జూలైలో 124 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి తిరిగి గ్రిడ్ నుంచి 309 యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నారు. ఈ రెండింటినీ సర్దు బాటు చేశాక ఆ నెలకు ఆయనకు 179 యూనిట్ల వినియోగానికి సంబంధించి రూ. 877 బిల్లును టీజీఎస్పీడీసీఎల్ జారీ చేసింది. కానీ అక్టోబర్ నెలలో మాత్రం 158 యూనిట్లను గ్రిడ్‌కు ఎక్స్పోర్ట్ చేసి గ్రిడ్ నుంచి 330 యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నందుకు ఆయనకు 172 యూనిట్ల వినియోగానికే బిల్లు జారీ చేయాల్సి ఉంది. కానీ టీజీఎస్పీడీసీఎల్ మాత్రం రూ. 1,444 బిల్లు పంపింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతించకపోయినా సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారుల విద్యుత్ బిల్లులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఏకపక్షంగా పెంచేసింది. రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా శనివారం ఈఆర్సీకి చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. నెట్ మీటరింగ్ బదులు.. రాష్ట్రంలో సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు నెట్ మీటరింగ్ విధానంలో బిల్లులను జారీ చేస్తున్నారు. వినియోగదారులు తమ సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్ అంటారు. గ్రిడ్ నుంచి విద్యుత్‌ను తమ అవసరాలకు వాడుకుంటారు. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ అంటారు. ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్‌తో పోలిస్తే ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ ఎక్కువ ఉన్నప్పుడు రెండింటి మధ్య ఉండే తేడాను తీసి దాని ఆధారంగా వినియోగదారులకు బిల్లులను జారీ చేయాలి. దీన్నే నెట్ మీటరింగ్ విధానం అంటారు.కానీ అక్టోబర్ నెలకు సంబంధించి సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ నెట్ మీటరింగ్‌కు బదులుగా నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులు జారీ చేసింది. అంటే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్‌కు, గ్రిడ్ నుంచి వినియోగదారుడు తీసుకున్న విద్యుత్‌కు వేర్వేరుగా చార్జీలను లెక్కించింది. ఈ రెండు చార్జీలను సర్దుబాటు చేసి తుదకు మిగిలే మొత్తాన్ని వినియోగదారులకు బిల్లులుగా జారీ చేసింది. వినియోగదారులు ఎక్స్పోర్ట్ చేసే విద్యుత్‌కు టీజీఎస్పీడీసీఎల్ ఇచ్చే «చార్జీలతో పోలిస్తే వినియోగదారులు ఇంపోర్ట్ చేసుకునే విద్యుత్‌పై విధించే చార్జీలు అధికంగా ఉన్నాయి. దీంతో వినియోగదారుల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ తిరస్కరించినా... సోలార్ రూఫ్‌టాప్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈఆర్సీ నవంబర్ 15న ప్రకటించింది. నెట్ మీటరింగ్ విధానానికి బదులు నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లుల వసూళ్లకు అనుమతించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేయగా ఈఆర్సీ తిరస్కరించింది. తుది రెగ్యులేషన్‌లో నెట్ మీటరింగ్ విధానాన్నే కొనసాగించాలని స్పష్టం చేసింది. అయినా అందుకు విరుద్ధంగా టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులపై నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులను పెంచేయడం గమనార్హం. -
రూఫ్‌టాప్ సౌరభం!
పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం! సోలార్ పవర్ ‘టాప్’లేపుతోంది! నివాసాల్లో సౌర విద్యుత్ వాడకం జోరందుకుంది. మోదీ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక ఫ్లాగ్íÙప్ పథకం పీఎం సూర్య ఘర్ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో దాదాపు 4 లక్షలకు పైగా గృహ సోలార్ కనెక్షన్లు కొత్తగా జతయ్యాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) 1.8 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా అంచనా. ఈ ఏడాది మార్చి నాటికి నివాస రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 3.2 జీడబ్ల్యూగా నమోదైంది. అంటే, దీంతో పోలిస్తే గడిచిన ఆరు నెలల కాలంలో 50 శాతం పైగా సామర్థ్యం ఎగబాకినట్లు పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇదంతా పీఎం సూర్య ఘర్ స్కీమ్ చలవేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, దేశంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం 2024 మార్చి నాటికి 11.9 జీడబ్ల్యూగా ఉంది. ఇందులో అత్యధికంగా సుమారు 60 శాతం వాటా వాణిజ్య, పారిశ్రామిక విభాగాలదే! సబ్సిడీ పెంపు.. తక్కువ వడ్డీకే రుణం.. ఇంటి డాబాలపై సౌర విద్యుత్ సిస్టమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటి నుంచో ఉంది. ఖర్చు తడిసిమోపెడవుతుండటంతో ప్రజల నుండి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, గ్రీన్ ఎనర్జీ పాలసీపై గట్టిగా దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం గృహాల్లో సోలార్ వెలుగులు పెంచేందుకు పీఎం సూర్య ఘర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా అధిక వ్యయ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ మాడ్యూల్స్‌పై సబ్సిడీని 40% నుంచి 60%కి పెంచింది. 7% వడ్డీకే రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. దీంతో రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గత కొన్ని నెలలుగా భారీగా పెరిగినట్లు జేఎంకే రీసెర్చ్, ఎనలిటిక్స్ తాజా నివేదికలో వెల్లడైంది. కాగా, ఈ జోరు ఇలాగే కొనసాగితే నివాస సౌర విద్యుత్ సామర్థ్య విస్తరణలో ఈ స్కీమ్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనేది నిపుణుల మాట!ఏటా 8–10 గిగావాట్లు..దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచడంలో భాగంగా 2027 నాటికి నివాస గృహాల రూఫ్‌టాప్ సోలార్ స్థాపిత సామర్థ్యాన్ని 30 గిగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే ఏటా 8–10 జీబ్ల్యూ వార్షిక సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు జతకావాల్సి ఉంటుంది. ‘మిగులు విద్యుత్‌ను తిరిగి విక్రయించడంతో సహా డిస్కమ్‌ల నుంచి అనుమతులను పొందడం విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. రుణ సదుపాయంతో పాటు ప్రజల్లో సౌర విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుపై అవగాహన పెంచేలా చర్యలు చేపడుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ వి. పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచడం, సోలార్ మాడ్యూల్స్‌పై వ్యయాలను తగ్గించడం, వినియోగదారుల్లో ఈ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం వంటి అంశాల నేపథ్యంలో రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఈ స్కీమ్ అమలుకు దన్నుగా నిలుస్తున్నాయి. గృహ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునే కస్టమర్లకు నెట్ మీటరింగ్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వీటి ఏర్పాటుకు రుణాలిచ్చే సంస్థలు అరకొరగానే ఉండేవి. ఇప్పుడు 25కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు రుణాలిస్తున్నా యి. దీంతో నివాసపరమైన రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ పుంజుకుంటోంది’ అని విక్రమ్ చెప్పారు. సవాళ్లున్నాయ్...గృహాల్లో సోలార్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మోదీ సర్కారు 2027 నాటికి కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.75,021 కోట్ల మొత్తాన్ని (ప్రభుత్వ వ్యయం) కేటాయించింది కూడా. భారత్ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలన్న సంకల్పానికి సూర్య ఘర్ పథకం చేదోడుగా నిలుస్తుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు పొంచి ఉన్నాయని... ముఖ్యంగా దేశీయంగా నివాస రంగానికి దేశీయ సోలార్ మాడ్యూల్స్ లభ్యతను పెంచాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఫొటోవోల్టాయిక్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం, డిమాండ్ మధ్య భారీ అంతరం ఉందని, ఈ మేరకు ప్లాంట్ల సామర్థ్యం భారీగా పెరగాల్సి ఉందనేది వారి అభిప్రాయం. చిన్న, మధ్య తరహా గృహ విద్యుత్ వినియోగదారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకునేలా మరింత ప్రోత్సహించాలని కూడా నిపుణుల సూచిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు తెగ డిమాండ్
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు డిమాండ్ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ మార్కెట్ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్ సదస్సులో భాగంగా మాథుర్ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖల సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. -
పెరిగిపోతున్న సామర్ధ్యం.. 9.3 గిగా వాట్లకు రూఫ్‌టాప్ సోలార్
న్యూఢిల్లీ: దేశంలో రూఫ్‌టాప్ సోలార్ (పై కప్పులపై సోలార్ విద్యుదుత్పాదన) సామర్థ్యం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.35 శాతం పెరిగింది. మొదటి మూడు నెలల్లో 485 మెగావాట్ల సామర్థ్యం మేర సోలార్ రూఫ్టాఫ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా ఏర్పాటైన సామర్థ్యం 456 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2023 మార్చి నాటికి భారత్‌లో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. 2022 చివరి మూడు నెలల్లో ఏర్పాటైన 483 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంతో పోలిస్తే 0.4 శాతం మేర ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ‘క్యూ1, 2023 మెర్కామ్ ఇండియా రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 2023 జనవరి – మార్చి త్రైమాసికంలో ఏర్పాటైన మొత్తం 485 మెగావాట్లలో 58 శాతం గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నదే కావడం గమనార్హం. పరిశ్రమలపై 28 శాతం, వాణిజ్య వినియోగదారులు ఏర్పాటు చేసుకున్న సామర్థ్యం 14 శాతం చొప్పున ఉంది. దేశంలో మొత్తం సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో రూఫ్‌టాప్ సోలార్ వాటా 26 శాతానికి చేరుకుంది. 2022లో హెచ్చు తగ్గులను చూసిన తర్వాత రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘విద్యుత్ రేట్లు పెరుగుతుండడంతో రూఫ్‌టాప్ సోలార్ ఆకర్షణీయంగా మారుతోంది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుంది’’ మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏర్పాటైన రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యంలో 70 శాతం వాటా ఆక్రమించాయి. ఇందులో గుజరాత్ వాటా అత్యధికంగా 24 శాతం మేర ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. -
‘రూఫ్ టాప్ సోలార్’ జగడం!
సాక్షి, హైదరాబాద్: కార్యాలయాల పై కప్పులపై (రూఫ్ టాప్) సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం రెండు ప్రభుత్వ సంస్థల మధ్య వివాదం రేపుతోంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన విభాగం(నెడ్‌క్యాప్) కసరత్తు చేస్తుంటే, భద్రతపరంగా దీన్ని స్వాగతించలేమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) అంటున్నాయి. రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానళ్లు ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను నెడ్‌క్యాప్ గుర్తించింది. నెట్ మీటరింగ్ ఏర్పాటు కోసం డిస్కమ్‌లకు ప్రతిపాదనలు పంపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించే విభాగం సమగ్ర నివేదిక ఇవ్వకుండా దీన్ని అంగీకరించలేమని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. టార్గెట్లు పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ తొందపడుతుండగా, ప్రాణభయం ఉందంటూ అడ్డుకోవడానికి డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. డిస్కమ్‌ల లైన్లకే సోలార్ విద్యుత్ వెళ్తుంది. ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను డిస్కమ్‌లే కొనుగోలు చేయాలి. కాబట్టి వాటి నుంచి అనుమతి తప్పనిసరి. కానీ, డిస్కమ్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పంచాయితీ కేంద్ర ఇంధన శాఖకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డిస్కమ్‌ల అభ్యంతరాలను కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసేందుకు నెడ్‌క్యాప్ సన్నాహాలు చేస్తోంది.


