రూఫ్‌టాప్‌ సోలార్‌ కిట్లకు తెగ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

రూఫ్‌టాప్‌ సోలార్‌ కిట్లకు తెగ డిమాండ్‌

Published Thu, Aug 24 2023 6:14 AM

Sales of rooftop solar energy kits rise to 5. 2 million globally in second half of 2022 - Sakshi

న్యూఢిల్లీ: రూఫ్‌టాప్‌ సోలార్‌ కిట్లకు డిమాండ్‌ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్‌ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలియన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ మాథుర్‌ తెలిపారు.

సోలార్‌ రూఫ్‌టాప్‌ మార్కెట్‌ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్‌ సదస్సులో భాగంగా మాథుర్‌ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ శాఖల సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement