
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి అంబులెన్స్‌లోనే పదో తరగతి పరీక్ష రాశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బకల్‌వాడీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన గౌతమ్.. మిర్యాలగూడలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్నాడు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గౌతమ్ తీవ్రంగా గాయపడటంతో కాలుకు సర్జరీ జరిగింది. పరీక్షలు రాస్తానని గౌతమ్ పట్టుపట్టడంతో.. తల్లిదండ్రులు వైద్యుల పర్యవేక్షణలో అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లోనే పరీక్ష రాసేం దుకు అధికారులు అనుమతి ఇచ్చారు.