ఎంటెక్‌ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ | Special Counseling For M Tech Students From 9th Nov | Sakshi
Sakshi News home page

ఎంటెక్‌ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌

Nov 8 2022 12:43 AM | Updated on Nov 8 2022 12:43 AM

Special Counseling For M Tech Students From 9th Nov - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది.

ఈనెల 15న సీట్ల కేటాయింపు ఉంటుందని, 19లోగా సీట్లు వచ్చిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాలని సూచించింది. కాగా, డిగ్రీలో ప్రవేశానికి (సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు) 9, 10 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement