ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో అక్రమాలపై ప్రత్యేక కమిటీ | Special committee on irregularities in Dharani and Bhu-Bharathi portals | Sakshi
Sakshi News home page

ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో అక్రమాలపై ప్రత్యేక కమిటీ

Jul 2 2026 6:01 AM | Updated on Jul 2 2026 6:01 AM

Special committee on irregularities in Dharani and Bhu-Bharathi portals

మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో లోకేశ్, నారాయణరెడ్డి తదితరులు

బాధ్యుల గుర్తింపు, కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది  

రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ధరణి, భూ భారతి పోర్టల్స్‌లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌.లోకేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలున్నాయని, వాటిని కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన భూ భారతి పోర్టల్‌ కూడా.. ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా లోపాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌ ద్వారా మాడ్యూల్స్‌ రూపొందించిన వ్యక్తులే దీనివెనుక ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోందని, ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

 కమిటీలో సభ్యులుగా... మిక్కిలినేని మనుచౌదరి (కలెక్టర్, మేడ్చల్‌–మల్కాజిగిరి), ప్రతీక్‌ జైన్‌ (కలెక్టర్, సంగారెడ్డి), అనుదీప్‌ దురిశెట్టి, (సంయుక్త కార్యదర్శి, ఐటీ, కమ్యూనికేషన్స్‌), హర్ష వర్ధన్‌ (తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో), అపూర్వ్‌ చౌహాన్‌ (ప్రాజెక్ట్‌ డైరెక్టర్, సీఎంఆర్‌ఓ), మంద మకరంద్‌ (ప్రాజెక్ట్‌ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్‌), ఏ.సంపత్‌ (డీఎస్పీ, సైబర్‌ క్రైమ్స్‌), ఎం.సుభాíÙణి (డీఐజీ, రిజి్రస్టేషన్స్‌), ఏ.శ్రీనివాస సుబ్బారావు (సీనియర్‌ డైరెక్టర్‌ (ఐటీ), ఎన్‌ఐసీ) లను నియమించినట్టు తెలిపారు.

మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ద్వారా పూర్తిగా కొత్తగా, అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సిస్టమ్‌ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుందని వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.  

గిరిజన రైతులకు భూ భారతిలో ప్రత్యేక మాడ్యూల్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన రైతులకు ఉపశమనం కలిగించేలా ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద ఉన్న పోడు భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. 2.30 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6.70 లక్షల ఎకరాల పోడు భూములకు ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద పట్టాలు ఉన్నా ధరణి, అనంతరం భూ భారతి పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో రైతులు పంట రుణాలు, విద్యుత్‌ కనెక్షన్లు, బోర్ల అనుమతులు, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై రైతు కమిషన్‌ గతేడాది చివర్లో ప్రత్యేకంగా స్పందించి, ఎస్‌ఎల్‌బీసీ, రెవె న్యూ, అటవీ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గిరిజన రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు భూ భారతి పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ను రూపొందించినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో రైతు కమిషన్‌ చేసిన సిఫారసుల మేరకు ప్రభుత్వం భూభారతిలో ప్రత్యేక మాడ్యూల్‌ కోసం నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి వెల్లడించారు. దీంతో ఇకపై పోడు పట్టాలున్న గిరిజన రైతులు పంట రుణాలు పొందడంతో పాటు బోర్ల అనుమతులు, విద్యుత్‌ సరఫరా, పంట కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం వంటి ప్రభుత్వ సేవలు పొందేందుకు అవకాశం కలుగుతుంద న్నారు. గిరిజన రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి  ఎం.కోదండరెడ్డి,  రాములు నాయక్, కేవీఎన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement