బుల్లి మగ్గం.. సీఎంకు బహుమానం

Sircilla weaver to gift CM KCR creates miniature power loom   - Sakshi

బుల్లి మగ్గం.. సీఎంకు బహుమానం

సిరిసిల్ల నేతకారుడి అద్భుత సృష్టి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి నేడు(ఆదివారం) సిరిసిల్లకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందించేందుకు నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ బుల్లి మగ్గాన్ని సిద్ధం చేశాడు. కర్రలు, చిన్న మోటార్‌లో పింజర్లతో కూడిన పవర్‌లూమ్‌ను తయారు చేశాడు. ఆ మగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలతో కూడిన బట్టను, గులాబీ జెండాను ఉంచాడు. బ్యాటరీ సాయంతో మర మగ్గం చకచకా నడుస్తుంది. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి ముఖ్యమంత్రికి ప్రత్యేక బహుమతి అందించేందుకు రూ.10 వేలు వెచ్చించి హరిప్రసాద్‌తో ఈ బుల్లి మగ్గం తయారు చేయించాడు.  గతంలో హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, చేనేత వస్త్రంపై పలు చిత్రాలను నేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top