
హైదరాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం(సెప్టెంబర్ 26 వ తేదీ) ఉత్తర్వులు జారీ చేసింది. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్నారు.
అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. డీజీపీ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్‌ను కలిశారు శివధర్‌రెడ్డి. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు శివధర్‌రెడ్డి.
