శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత | Seven Gates Of Srisailam Dam Lifted | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత

Aug 29 2022 1:32 AM | Updated on Aug 29 2022 2:42 PM

Seven Gates Of Srisailam Dam Lifted - Sakshi

దోమలపెంట/గద్వాల రూరల్‌: శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువనున్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,03,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఆనకట్ట వద్ద 7 గేట్లు ఒక్కొక్కటి 10 అడుగుల మేర పైకెత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 62,708 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు 1,85,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 37 గేట్లు ఎత్తి 1,52,292 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 36,111 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement