
జాతరకు వస్తున్న ఎడ్ల బండ్ల రథాలు
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం జరిగిన మకర సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల మొక్కుల సమర్పణతోపాటు కొత్తపల్లికి చెందిన 65 ఎడ్లబండ్ల రథాలు, వేలేరుకు చెందిన మేకల బండ్లను తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హనుమకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎడ్లబండిపై గుడి చుట్టూ తిరిగి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.