TGSRTC ఫేక్‌ ప్రచారంపై సజ్జనార్‌ క్లారిటీ | TSRTC MD Sajjanar Gives Clarity On TGSRTC Viral Logo, More Details Inside | Sakshi
Sakshi News home page

TGSRTCపై ఫేక్‌ ప్రచారం.. సజ్జనార్‌ క్లారిటీ

Published Thu, May 23 2024 10:06 AM

Sajjanar Clarity On TGSRTC Viral Logo

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్‌ సైతం కథనాలిచ్చాయి. అయితే  TGSRTCపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. 

TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్‌లో ఒకటి వైరల్‌ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్‌ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. 

.. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్‌ ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. 

 

అత్యుత్సాహంతో కొన్ని వెబ్‌సైట్లు అలా లోగోను డిజైన్‌ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్‌ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement