మరో 17.31 లక్షల మందికి రైతుబంధు | Rythu Bandhu For 17. 31 Lakh Farmers: Singireddy Niranjan Reddy | Sakshi
Sakshi News home page

మరో 17.31 లక్షల మందికి రైతుబంధు

Dec 30 2021 5:37 AM | Updated on Dec 30 2021 2:23 PM

Rythu Bandhu For 17. 31 Lakh Farmers: Singireddy Niranjan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకం కింద రెండోరోజు రూ.1255.42 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17,31,127 మంది రైతులకు సాయం అందించామన్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తంగా 35,43,783 మంది రైతుల ఖాతాల్లో రూ.1799.99 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులు పెరగడంతో పలు రంగాలకు ఉపాధి లభించిందన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement