నేరేడ్‌మెట్‌ కౌంటింగ్‌: ఆర్వో సంచలన కామెంట్స్‌

RO Meena Comments Neredmet Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరేడ్‌మెట్‌ కౌంటింగ్‌ సందర్భంగా జరిగిన వాదోపవాదనలపై ఆర్వో లీనా కలత చెందారు. ఎన్నికల్లో తాను ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆర్వో లీనా వివరించారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాపై పలువురు అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. నా విధులకు ఆటంకం కల్పించడం, నన్ను అసభ్యంగా దూషించడంపై నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నన్ను తిట్టిన కాల్‌ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇస్తాను. ఎన్నికల్లో నేను పారదర్శకంగా పనిచేశా. ఎవరికీ అమ్ముడుపోలేదు. నా సెల్‌ఫోన్‌, కాల్‌ రికార్డ్స్‌ అన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నా' అని ఆర్వో లీనా తెలిపారు. చదవండి: (నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం)

ఇదిలా ఉండగా నేరేడ్‌మెట్‌ కౌంటింగ్‌ వద్ద బీజేపీ అభ్యర్థి ఆందోళన దిగారు. రిజక్ట్‌ అయిన 1,300 ఓట్లను కూడా లెక్కించాలంటూ బీజేపీ అభ్యర్థి డిమాండ్‌ చేస్తున్నారు. కాగా 544 ఓట్లు మాత్రమే లెక్కించినట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. 544 ఓట్లలో 278 టీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చాయి. గతంలో టీఆర్‌ఎస్‌కు 504 ఓట్ల ఆధిక్యం ఉండటంతో.. మొత్తంగా 782 ఓట్లతో టీఆర్‌ఎస్‌​పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్‌ రెడ్డి విజయం సాధించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top