సీనియర్‌ పాత్రికేయుడు ప్రభుకిరణ్‌ కన్నుమూత  

Rev TA prabhu Kiran Passed Away In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ సువార్తికులు రెవ.టి.ఎ. ప్రభుకిరణ్‌ (63) ఆదివారం కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో కన్నుమూశారు. పదిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రభుకిరణ్, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెంబర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత జనగామ జిల్లా పెంబర్తికి చెందిన ప్రభుకిరణ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు.

అనంతరం క్రైస్తవ మత ప్రవచకులుగా ఉంటూనే ‘సాక్షి’ఫ్యామిలీ సన్నిధి పేజీలో పన్నెండు సంవత్సరాలకు పైగా ఆయన రాసిన సువార్త వ్యాసాలు ఎంతో పాఠకాదరణ పొందాయి. ఆయన మృతి పట్ల సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళి సంతాపం ప్రకటించారు. ప్రభుకిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
చదవండి: నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top