‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!

Replanting Cut Tree: Sangareddy Man Gnaneswar Replant RaviChettu - Sakshi

అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్‌.
ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top