
11 మందిపై కేసు, 9 మంది అరెస్ట్
కొండాపూర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహణ
హైదరాబద్: వీకెండ్‌లో అమ్మాయిలతో డ్యాన్స్‌లు, గంజాయి, డ్రగ్స్, మందు తాగుతూ చిందేస్తుండగా..పక్కా సమాచారంతో ఎస్‌టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే... కొండాపూర్ జేవీహిల్స్ కాలనీలోని ఎస్‌వీ.నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో వీకెండ్‌లో ఏపీకి చెందిన కొందరు కొంతకాలంగా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా అలాంటి పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందగా దాడులు చేశారు.
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ తెప్పించే కింగ్‌కెన్‌షేర్ రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ మన్నె అప్పికొట్ల అశోక్‌కుమార్, మరో ఆర్గనైజర్ సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతాతేజ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల్లో టీడీపీ నాయకులకు చెందినవి ఉన్నట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అశోక్ నాయుడు వాహనం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
