చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని.. | Sakshi
Sakshi News home page

చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని..

Published Mon, Mar 28 2022 6:55 PM

Rare North American Oval Bird Found In Chikkadpally Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ అరుదైన నార్త్ అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షినీ నగర వాసులు కాపాడారు. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్‌టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షానికి ఉన్న పతంగి మంజాకి చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి దాహాన్ని తీర్చారు.

చదవండి: వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్‌గా గుర్తించారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement