Monkey Feeding Baby Cat in East Godavari - Sakshi
Sakshi News home page

వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Mar 28 2022 3:45 PM | Updated on Mar 28 2022 5:58 PM

Monkey Feeding Baby Cat In East Godavari - Sakshi

పిల్లి పిల్లకు తిండి తినిపిస్తున్న కోతి

కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది.

పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement