తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు | Telangana And Andhra Pradesh Rainfall Weather, Heavy Rains Expected, Yellow Alert Issued In Several Districts | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Aug 30 2026 10:44 AM | Updated on Aug 30 2026 11:47 AM

Rain Forecast Issued For East And North Telangana

సాక్షి, హైదరాబాద్‌: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, ఉత్తర తెలంగాణకు వర్ష సూచన జారీ అయ్యింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌,  మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  పేర్కొంది.

భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి, వరంగల్‌, నిజామాబాద్‌లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement