భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌: ప్రతీ వ్యక్తిని జూమ్ చేస్తాం.. వాటికి అనుమతి లేదు: సీపీ

Rachakonda CP Mahesh Bhagwat Press Meet On Ind Aus Match - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభిమానులు ట్రాఫిక్‌ ఆంక్షలను పాటించాలన్నారు. మ్యాచ్‌ రోజున మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేశారని సీపీ పేర్కొన్నారు. 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.
చదవండి: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్‌

2500 పోలీస్ సిబ్బంది..
‘‘ఎల్లుండి జరిగే మ్యాచ్‌కి 2500 పోలీస్ సిబ్బందితో సెక్యురిటి ఏర్పాటు చేశాం. 40 వేలకు పైగా ప్రేక్షకులు వస్తారు. ప్లేయర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం ప్రాక్టీస్‌కి వస్తారు. ఎల్లుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఎక్కువ మెట్రో సర్వీసులు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. 300 సీసీ కెమెరాలు ఉన్నాయి.. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేస్తామని తెలిపారు.

వాటికి అనుమతి లేదు..
గ్రౌండ్‌లో ఉండే ప్రతీ వ్యక్తిని జూమ్ చేసి చూసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకి అనుసంధానం చేస్తాం. ప్రేక్షకుల మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్  అనుమతిస్తాం. సిగరెట్, కెమెరాలు, షార్ప్ ఆబ్జెక్ట్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, బయట ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్‌కి అనుమతి లేదని’’ సీపీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top