జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌: సీఎంకు ప్రెస్‌క్లబ్‌ కృతజ్ఞతలు

Press Club Of Hyderabad Thanks To CM KCR Over Journalists Corona Vaccination - Sakshi

పంజగుట్ట: రాష్ట్రంలోని అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులందరికీ ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌కుమార్‌ రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళిచారిలు స్వాగతించి, కృతజ్ఞతలు తెలిపారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్‌ యూనియన్‌ కార్యాలయం, ఎంసీహెచ్‌ఆర్‌డీ, చార్మినార్‌ యునానీ ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు వ్యాక్సిన్‌ వేయనున్నట్లు పేర్కొన్నారు.  అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
చదవండి: Corona Vaccine: సూపర్‌ స్ప్రెడర్స్‌కు టీకా ఇలా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top