కరోనాతో అనాథలైన చిన్నారులకు చేయూత

PPR Old Age Home Heps To Orphaned Children - Sakshi

హైదరాబాద్‌: బాలాపూర్‌కు చెందిన అర్రూర్‌ లక్ష్మమ్మ కుమారులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు 20 రోజుల వ్యవధిలో కరోనా కాటుకు బలయ్యారు. శ్రీనివాస్‌రెడ్డి భార్య మూడు సంవత్సరాల క్రితం కేన్సర్‌తో మరణించింది. దీంతో వారి పిల్లలు కూతురు (9), కొడుకు (7) అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న బాలాపూర్‌ గ్రామస్తులు ఆదివారం స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయంలో సమావేశం అయినారు. 

పీపీఆర్‌ ఓల్డ్‌ ఏజ్‌ హోం ట్రస్ట్‌ చైర్మన్‌ పన్నాల పర్వతాలు రెడ్డి ముందుకు వచ్చి చిన్నారుల బాగోగుల కొరకు రూ. లక్ష గ్రామ పెద్దల ముందు అందజేశారు. అలాగే గ్రామ పెద్దలు చిన్నారుల చదువులతో పాటు అన్ని రకాల అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బాలునాయక్, బండారి మనోహర్‌ తదితరులున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top