టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలో పోలీసుల సోదాలు

Police Ride In TRS Leaders House In Dubbaka - Sakshi

సాక్షి, సిద్ధిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లలో   సోదాలు చేపట్టారు. ఏక కాలం లో 8 మంది టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీచేశారు.  దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి ,  దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. 

చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top