తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ

PM Narendra Modi Visit To Telangana state - Sakshi

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం 

రెండు రోజుల పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు 

మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

4న రాత్రి హైదరాబాద్‌లో బస 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, ఆదిలాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి రెండో వారంలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చనే అంచనాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి మోదీ శంఖం పూరించనున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అక్టోబర్‌ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభంతోపాటు సభల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ 4వ తేదీన రాత్రి రాజ్‌భవన్‌లో బసచేస్తారు.  

ఇదీ మోదీ పర్యటన షెడ్యూల్‌... 
► 4న ఉదయం మహారాష్ట్ర నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎంఐ–17 హెలికాప్టర్‌లో బయలుదేరి ఉ దయం 10.20కు ఆదిలాబాద్‌కు చేరు కుంటారు.  
► 10.30 నుంచి 11 గంటలదాకా ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు 
► 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు 

► 12.15కు ఆదిలాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యా హ్నం 2.45 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే బసచేస్తారు. 

► మార్చి 5న ఉదయం 10,15 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు 
► 10.45 నుంచి 11.15 గంటల దాకా వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, పనులకు శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాలు చేస్తారు. 
► 11.25 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. 12.15 వరకు సభలో ప్రసంగిస్తారు. 
► 12.30కు హెలికాప్టర్‌లో సంగారెడ్డి నుంచి బయ లుదేరి 12.55కు బేగంపేటకు చేరుకుంటారు. 
► మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట నుంచి విమానంలో భువనేశ్వర్‌కు బయల్దేరుతారు. దీంతో మోదీ రాష్ట్ర పర్యటన పూర్తవుతుంది.   

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top