
నా భర్త నాగేశ్వరరావు పదేళ్లుగా ఈ కంపెనీలో క్వాలిటీ సెల్ విభాగంలో పనిచేస్తున్నాడు. పటాన్‌చెరులో నివాసం ఉంటాం. రోజులాగే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. వెళ్లిన గంటల వ్యవధిలో పరిశ్రమల ప్రమాదం జరిగిందని తెలిసింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాం. నా భర్త ఆచూకీ ఇంకా తెలియలేదు.
–హేమలత, పటాన్ చెరు
ఆచూకీ తెలియడం లేదు
రోజు మాదిరిగానే ఉదయం నా భర్త బాలకృష్ణ డ్యూటీకి వెళ్లాడు. విషయం తెలిసి వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చాం. తన భర్త ఆచూకీ తెలియడం లేదు. ఎవరిని అడిగినా చెప్పడంలేదు. లోపలికి రానివ్వడం లేదు.
–మల్లీశ్వరి, ముత్తంగి
నా గోడు పట్టదా?
మధ్యప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ ఉంటున్నాం. నా భర్త చోటేలాల్ సిగాచీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఉదయం యథావిధిగా డ్యూటీకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికే పరిశ్రమలో ప్రమాదం జరిగిందని తెలిసింది. నా భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతడి ఆచూకీ చెప్పాలని అధికారులను అడుగుతున్నా నాగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు.
–సంజు దేవి, స్వస్థలం మధ్యప్రదేశ్