Explosion incident
-
Pashamailaram: నా భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది
నా భర్త నాగేశ్వరరావు పదేళ్లుగా ఈ కంపెనీలో క్వాలిటీ సెల్ విభాగంలో పనిచేస్తున్నాడు. పటాన్చెరులో నివాసం ఉంటాం. రోజులాగే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. వెళ్లిన గంటల వ్యవధిలో పరిశ్రమల ప్రమాదం జరిగిందని తెలిసింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాం. నా భర్త ఆచూకీ ఇంకా తెలియలేదు. –హేమలత, పటాన్ చెరుఆచూకీ తెలియడం లేదురోజు మాదిరిగానే ఉదయం నా భర్త బాలకృష్ణ డ్యూటీకి వెళ్లాడు. విషయం తెలిసి వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చాం. తన భర్త ఆచూకీ తెలియడం లేదు. ఎవరిని అడిగినా చెప్పడంలేదు. లోపలికి రానివ్వడం లేదు. –మల్లీశ్వరి, ముత్తంగినా గోడు పట్టదా?మధ్యప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ ఉంటున్నాం. నా భర్త చోటేలాల్ సిగాచీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఉదయం యథావిధిగా డ్యూటీకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికే పరిశ్రమలో ప్రమాదం జరిగిందని తెలిసింది. నా భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదు. అతడి ఆచూకీ చెప్పాలని అధికారులను అడుగుతున్నా నాగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. –సంజు దేవి, స్వస్థలం మధ్యప్రదేశ్ -
అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.‘‘అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాను. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 -
రైల్వే ట్రాక్ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు..!
జైపూర్: ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ట్రాక్ దెబ్బతిన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పుర్ జిల్లా కెవ్డాలో ఉన్న ఓడ రైల్వే బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పేలుడు సంఘటన కలకలం సృష్టించిన క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్వీట్ చేశారు. ఓడ రైల్వే వంతెనపై పేలుడుతో రైల్వే ట్రాక్ పాడవటం ఆందోళనకర విషయమని, సీనియర్ అధికారులు స్పాట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. వంతెన పునఃనిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్ 31నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? -
గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్..! చర్యలకు సిద్దమైన కంపెనీ..!
Oneplus Sends Legal Notice To User: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ పేలిందని ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్ నోటీసులను పంపింది. కంపెనీ ప్రతిష్టదిగజారేలా ఆరోపణలు చేశాడని వన్‌ప్లస్ వెల్లడించింది. చదవండి: Apple Witnesses Record Iphone 13 Pre Orders: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! అసలు ఏం జరిగదంటే..! ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి ఈ నెల ఎనిమిదో తారీఖున వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కోర్టులో ఉండగా తన గౌనులో ఒక్కసారిగా పేలిందని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ పేలిన చిత్రాలను ట్విటర్లో పోస్ట్చేశాడు. వన్‌ప్లస్ కంపెనీ వినియోగదారులను మోసం చేస్తోందని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది. చర్యలకు సిద్దమైన వన్‌ప్లస్..! లాయర్ కోర్టులో వన్‌ప్లస్ కంపెనీపై పిటిషన్ దాఖలు చేయగా..తాజాగా వన్‌ప్లస్ యాజమాన్యం పిటిషన్ స్పందిస్తూ.. లాయర్‌కు దిమ్మే తిరిగేట్టుగా వన్‌ప్లస్ షాకిచ్చింది. సార్ట్‌ఫోన్‌పేలిందటూ లాయర్ అనవరంగా ఆరోపణలు చేశారని గౌరవ్ గులాటికి వన్‌ప్లస్ లీగల్ నోటీసులను పంపింది. వన్‌ప్లస్ తమ నోటీసుల్లో..కంపెనీపై తప్పడు ఆరోపణలు చేశాడని మండిపడింది. తమ ఫోన్లో ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించింది. ట్విటర్లో పబ్లిష్ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలంటూ కంపెనీ తమ పిటిషన్లో పేర్కొంది. లాయర్ చేసిన ఆరోపణలతో వన్‌ప్లస్ ప్రతిష్ట దిగజారిందని పిటిషన్లో పేర్కొంటూ..లాయర్‌పై పరువునష్టం దావాను కూడా వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్ ద్రావిడ్..ఇప్పుడు నీరజ్ చోప్రా..! సరికొత్త రూపంలో.. -
ఆ పేలుడుకు బాధ్యులెవరు?
- పుష్కరాల ముగింపు కోసం భారీగా ఆర్డర్లు - కొత్తపేటలో బాణసంచా పేలుడు ఘటనపై అనుమానాలు సాక్షి, రాజమండ్రి : కొత్తపేట పేలుడు ఘటనపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జిల్లాలో దీపావళి పర్వదినానికి రెండు నెలల ముందు నుంచి మాత్రమే బాణసంచా తయారు చేస్తారు. అయితే వేళకాని వేళలో ఇక్కడ బాణసంచా తయారు కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్తపేట ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, పలువురు క్షతగాత్రులయ్యారు. గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా చివరి రోజైన శనివారం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి పరివాహాక ప్రాంతంలో భారీఎత్తున బాణసంచా కాల్చడం ద్వారా పుష్కరాలకు ఘనంగా ముగింపు పలకాలని సర్కారు నిర్ణయించింది. మరీ ముఖ్యంగా పుష్కరాలు ముగింపోత్సవాలు జరిగే రాజమండ్రిలో కళ్లు మిరుమిట్లుగొలిపేలా కనీసం ఐదారుగంటల పాటు నిర్విరామంగా బాణ సంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, పుష్కరాల ప్రత్యేకాధికారి ధనుంజయరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం కనీసం రూ.ఐదారుకోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో శివకాశితోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ బాణసంచా తయారీ కేంద్రాల నుంచి రప్పిస్తున్నారు. కాగా ఉభయగోదావరి జిల్లాల్లో బాణసంచా తయారీదారులకు కూడా భారీగానే ఆర్డర్లు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేళ కాని వేళలో జిల్లా వ్యాప్తంగా అధికారికంగానే కాదు అనధికారికంగా కూడా పెద్దఎత్తున బాణసంచా తయారవుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం సంభవించిన పేలుడు ఘటన జరిగిన కొత్తపేట బాణసంచా తయారీ కేంద్రానికి కూడా ఇదే రీతిలో ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఇక్కడ రేయింబవళ్లు బాణసంచా తయారు చేస్తుండగా. ప్రమాదవశాత్తు బుధవారం ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇదే రీతిలో పెద్దఎత్తున బాణసంచా తయారు చేయడంతో పాటు భారీగా నిల్వ చేసినట్టు తెలుస్తోంది. కొత్తపేట ఘటనకు తోడు గోకవరం బస్టాండ్ వద్ద భారీ విస్ఫోటనం సంభవించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పుష్కరాల ముగింపు సందర్భంగా జరుపతలపెట్టిన బాణసంచా కాల్పుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొననున్నందున.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరిస్తున్నారు.


