గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్‌..! చర్యలకు సిద్దమైన కంపెనీ..!

Oneplus Sends Legal Notice To User Who Alleged Explosion Of Oneplus Nord 2 5G - Sakshi

Oneplus Sends Legal Notice To User: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేలిందని ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్‌ నోటీసులను పంపింది. కంపెనీ ప్రతిష్టదిగజారేలా ఆరోపణలు చేశాడని వన్‌ప్లస్‌ వెల్లడించింది.
చదవండి: Apple Witnesses Record Iphone 13 Pre Orders: ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్‌..!

అసలు ఏం జరిగదంటే..!
ఢిల్లీకి చెందిన గౌరవ్‌ గులాటి ఈ నెల ఎనిమిదో తారీఖున వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోర్టులో ఉండగా తన గౌనులో ఒక్కసారిగా పేలిందని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్‌ పేలిన చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌చేశాడు. వన్‌ప్లస్‌ కంపెనీ వినియోగదారులను మోసం చేస్తోందని కోర్టులో పిటిషన్‌ కూడా వేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది.      

చర్యలకు సిద్దమైన వన్‌ప్లస్‌..!
లాయర్‌ కోర్టులో వన్‌ప్లస్‌ కంపెనీపై పిటిషన్‌ దాఖలు చేయగా..తాజాగా వన్‌ప్లస్‌ యాజమాన్యం పిటిషన్‌ స్పందిస్తూ.. లాయర్‌కు దిమ్మే తిరిగేట్టుగా వన్‌ప్లస్‌ షాకిచ్చింది. సార్ట్‌ఫోన్‌పేలిందటూ లాయర్‌ అనవరంగా ఆరోపణలు చేశారని గౌరవ్‌ గులాటికి వన్‌ప్లస్‌ లీగల్‌ నోటీసులను పంపింది. వన్‌ప్లస్‌ తమ నోటీసుల్లో..కంపెనీపై తప్పడు ఆరోపణలు చేశాడని మండిపడింది. తమ ఫోన్‌లో ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించింది. ట్విటర్‌లో పబ్లిష్‌ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్‌ చేయాలంటూ కంపెనీ తమ పిటిషన్‌లో పేర్కొంది. లాయర్‌ చేసిన ఆరోపణలతో వన్‌ప్లస్‌ ప్రతిష్ట దిగజారిందని పిటిషన్‌లో పేర్కొంటూ..లాయర్‌పై పరువునష్టం దావాను కూడా వేసినట్లు తెలుస్తోంది.
చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్‌ ద్రావిడ్‌..ఇప్పుడు నీరజ్‌ చోప్రా..! సరికొత్త రూపంలో..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top