టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌: పాలమూరులో ప్రకంపనలు.. రేణుక తమ్ముడు కూడా పరీక్ష రాశాడా?

Palamuru district residents in TSPSC question paper leakage - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/గండేడ్‌:  టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన లు సృష్టిస్తోంది. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండ డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం మ హబూబ్‌నగర్‌తో పాటు గండేడ్‌ మండలంలోని మ న్సూర్‌పల్లి, పంచాంగల్‌ తండాలు, వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చుట్టూ తిరుగుతోంది. ఈ బాగోతంలో వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా?..అనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

రేణుక, డాక్యా ఇక్కడి వారే.. 
పేపర్ల లీకేజీకి పాల్పడింది కమిషన్‌ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ కాగా..నిందితుల జాబితాలో రేణుక, లవుడ్యావత్‌ డాక్యా దంపతులు ఉన్నారు. రేణుకది మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్‌ తండా. డాక్యా బీటెక్‌ పూర్తయిన తర్వాత 15 ఏళ్లుగా టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలంలో నాలుగేళ్ల పాటు టీఏగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లలో పనిచేస్తున్నాడు. రేణుకకు 2018లో వనపర్తి గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌ ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. ప్రస్తుతం రేణుక బుద్దా రం గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. 

అంతా బంధువులు, సన్నిహితులే: ప్రవీణ్‌ ద్వారా పేపర్లు సంపాదించిన రేణుక మొదట తన తమ్ముడు రాజేశ్వర్‌కు సమాచారమిచ్చింది. ఇతను మహబూబ్‌నగర్‌లోనే ఉంటున్నాడు. రాజేశ్వర్‌ తన పెద్దనాయన చంద్రానాయక్‌ కొడుకు శ్రీనివాస్‌ (బీటెక్‌)కు సమాచారం ఇచ్చాడు. అతడికి 2020లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మేడ్చల్‌లో పనిచేస్తున్నాడు.

ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. దీంతో తనకు ప్రశ్నపత్రం వద్దని.. తనకు సన్నిహితులైన మన్సూర్‌పల్లి తండా కు చెందిన కేతావత్‌ నీలేశ్‌ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్రనాయక్, వికారాబాద్‌ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్‌ గోపాల్‌నాయక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

రేణుక, డాక్యా దంపతులు ఒప్పందం కుదుర్చుకున్న వారిని వెంటబెట్టుకుని పంచాంగల్‌ తండాలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. అక్కడే వారితో రెండు రోజుల పాటు చదివించి.. పరీక్ష రోజు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ పరీక్షను రేణుక తమ్ముడు రాజేశ్వర్‌ కూడా రాశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top