‘నీ అంతు చూస్తా’ అని అనలేదు.. పాడి కౌశిక్‌ రెడ్డి వివరణ | Padi Kaushik Reddy Key Comments On Kadiyam Srihari Issue | Sakshi
Sakshi News home page

‘నీ అంతు చూస్తా’ అని అనలేదు.. పాడి కౌశిక్‌ రెడ్డి వివరణ

Oct 7 2026 12:47 PM | Updated on Oct 7 2026 12:47 PM

Padi Kaushik Reddy Key Comments On Kadiyam Srihari Issue

సాక్షి, హైదరాబాద్‌: కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఎథిక్స్‌ కమిటీకి వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి ‘నీ అంతు చూస్తా’ అని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. అలాగే గన్‌ గురిపెట్టినట్లు తాను సంజ్ఞలు చేశానన్న ఆరోపణలు కూడా అవాస్తవమని తెలిపారు.

అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తప్పుగా అర్థం చేసుకుని తనపై అభియోగాలు మోపారని కౌశిక్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తన హావభావాలను సందర్భం నుంచి వేరు చేసి చూపించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్‌ సభ్యులే చేశారని తెలిపారు. సభలో జరిగిన వాగ్వాదం, పరస్పర ఆరోపణలు, నినాదాల మధ్యే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.

అసెంబ్లీ ఘటనకు సంబంధించి ఎథిక్స్‌ కమిటీకి అందించిన వీడియో క్లిప్పింగ్‌ అసంపూర్ణంగా ఉందని కౌశిక్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను పరిశీలించాలని కోరారు. ఆఫ్‌-రికార్డ్‌ వీడియో ఫుటేజ్‌ను కూడా పరిశీలించాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. పూర్తి ఘటనను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. కడియం శ్రీహరి కూడా రెచ్చగొట్టే సంజ్ఞలు చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో రికార్డులను పరిశీలించకుండా కేవలం పాక్షిక వీడియో ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని ఎథిక్స్‌ కమిటీని కోరారు.

రూల్‌ 288 కింద తన చర్యలను అనైతిక ప్రవర్తనగా పరిగణించలేమని కౌశిక్‌ రెడ్డి వాదించారు. తోటి సభ్యుల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవేనని పరోక్షంగా పేర్కొన్నారు. పూర్తి ఆధారాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, ఎలాంటి పాక్షిక సమాచారంతో తీర్పు ఇవ్వొద్దని కౌశిక్‌ రెడ్డి ఎథిక్స్‌ కమిటీని కోరారు. తనపై న్యాయబద్ధమైన విచారణ జరిపి, మొత్తం వీడియో రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement