Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM Chandrababu Lies On YS Jagan Govt In The Name Of Swetha Patram
‘భూ’కాయింపు! శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు

సాక్షి, అమరావతి: ప్రజలకు మోసపూ­రిత హామీలిచ్చి వాటిని అమలు చేయలేక కాలయా­పన చేస్తున్న సీఎం చంద్రబాబు దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో అభూత కల్పనలు, అడ్డగోలుగా వక్రీకరణలకు దిగారు. పేదలకు మంచి జరిగేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను దోపిడీగా చిత్రీకరి­స్తూ తన కడుపుమంటను మరో­సారి బయట పెట్టుకున్నారు. ఖజా­నాకు రాబడి పెంచిన ప్రభు­త్వాన్ని నిందిస్తూ.. ఆదాయా­నికి తూట్లు పొడుస్తున్న తన సర్కారు గురించి జబ్బలు చరుచుకోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మ­యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమే విస్తుపో­యేలా నాడు అమరావతి, విశాఖలో తన హయాంలో జరిగిన భూ కుంభకోణాలను నిస్సిగ్గుగా కప్పిపు­చ్చుతూ బురద చల్లేందుకు సీఎం చంద్రబాబు యత్నించారు. అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా దళితులు, పేదల జీవితకాల కోరికను నెరవేర్చడాన్ని తప్పుబట్టి ఆయా వర్గాలను దారుణంగా అవమానించారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయ­కులు, కార్యక­ర్తలు వేల కోట్లు దోచుకోగా, వైఎస్సార్‌­­సీపీ హయాంలో ఒక క్రమ­పద్ధతి ప్రకారం జరిగిన విక్ర­యాలను తప్పుబడుతు­న్నారు. ధరల బోర్డు ఏర్పాటు చేసి మరీ ఇసుకను విక్రయిస్తూ పైకి మాత్రం ఉచితమంటూ బుకాయిస్తు­న్నారు. పారద­ర్శకంగా ఇసుక అందచేసి ఏటా రూ.750 కోట్లకు­పైగా ఆదా­యాన్ని, ఐదేళ్లలో రూ.4 వేల కోట్ల రాబడిని గత ప్రభుత్వం ఖజానాకు జమ చేయడం అక్రమమా? ప్రభుత్వా­నికి రూపాయి రాబడి లేకుండా చేసి ఉచిత ఇసుక పేరుతో పచ్చ­ముఠాల జేబులు నింపడం ఓ గొప్ప పథకమా? భూము­ల సమగ్ర రీ సర్వే (జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష చట్టం) ద్వారా అమ్మేవారికి, కొనేవారికి పూర్తి భరోసా లభిస్తుంది. వివాదరహితంగా భూములపై హక్కులు కల్పించడంతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆంగ్లేయుల తరువాత భూము­ల సమగ్ర సర్వే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ హయాంలో చేపట్టింది. రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగా సర్వే చేయడంతోపాటు సరిహద్దు రాళ్లను కూడా ఉచితంగానే పాతేలా చర్యలు తీసుకుంది. 15,000 మంది సర్వే­యర్లను నియమించింది. చంద్రబాబు ఆరోపిస్తున్న­ట్లుగా కబ్జాలే నిజమైతే తమ భూములు లాక్కున్నా­రని ఏ ఒక్క రైతైనా ఫిర్యాదు చేశారా? గత సర్కారు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా అరికడితే దాని­పైనా అడ్డగోలు వాదనకు దిగారు. సహజ వనరు­లను దోపిడీ చేశారని, భూములను దోచుకున్నారని కళ్లార్పకుండా బుకాయించారు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌ తెచ్చినవి సంస్కరణలైతే చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నవన్నీ స్కామ్‌లే!!పేదలకు భూమి పంచడం నేరమా?వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు భూమిని పంచడాన్ని అక్రమంగా చంద్రబాబు అభివర్ణించా­రు. 46 వేల ఎకరాలను 40 వేల మందికిపైగా రైతు­లకు పంపిణీ చేయడాన్ని తçప్పుబడుతూ అందులో 8 వేల ఎకరాలను వైఎస్సార్‌సీపీ వారికి పంచారంటూ గగ్గోలు పెట్టారు. నిరుపేదలైన వారికి భూములు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ అందులో రూ.1,300 కోట్ల అవినీతి జరిగిందని పేదలపై తనకున్న ద్వేషాన్ని చంద్రబాబు చాటుకున్నారు. చంద్రబాబు తన హయాంలో భూ పంపిణీయే చేయ­లేదు. ఏనాడూ పేదల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. అసైన్డ్‌ భూములపై అడ్డగోలు వాదనఅసైన్డ్‌ భూముల రైతులకు చారిత్రక రీతిలో వైఎస్సార్‌సీపీ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతు­న్నారు. వారి భూములపై వారికి హక్కులు కల్పించడం తప్పన్నట్లు చిత్రీకరించారు. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక అసైన్డ్‌ రైతులు అవస్థలు పడ్డా పట్టించుకోని చంద్రబాబు, వారికి హక్కులు ఇవ్వడాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ భూములను కొట్టేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. అసైన్డ్‌ రైతులకు వారి భూములపై సంపూర్ణ అధికారాలు దక్కడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని దీన్నిబట్టి స్పష్ట­మవుతోంది. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంతమంది రైతులు హక్కులు వచ్చాక వాటిని విక్ర­యించా­రు. 27 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల­కు­గానూ తొలి విడత­లో పది లక్షల ఎకరాలను నిషే­ధిత జాబితా నుంచి తొలగించి వారికి హక్కు­లు కల్పించారు. అందులో కొంతమంది అమ్ముకో­వడం ముఖ్య­మంత్రికి నేరంగా కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో 22 ఏలో చేర్చిన 2 లక్షల ఎకరాల నిషేధిత భూములు, 34 వేల ఎకరాల షరతుగల పట్టా భూములు, 50 వేల ఎక­రాల అనాధీనం భూములపై వైఎస్సార్‌పీ హయాంలో ఆంక్షలు తొలిగాయి. 1.79 లక్షల ఎకరాల సర్వీస్‌ ఈనాం భూములను 22ఏ నుంచి తొలిగించి వారికి మేలు చేశారు. రైతుల సాగులో ఉన్న 9,064 ఎక­రాల లంక భూము­లను 17,768 మంది లబ్ధి­దా­­రులకు హక్కులతో అందచేసింది. ఎస్సీలకు శ్మశా­­న వాటికల కోసం 1,543 గ్రామాలలో 933 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయ­తీలకు అప్పగించింది. ఇవన్నీ చంద్రబాబుకు అక్ర­మాలు, అన్యాయాలుగా కనిపించడాన్ని ఏమనాలి?రీ సర్వేపై తప్పుడు భాష్యాలు.. గత వందేళ్లలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన భూముల రీ సర్వేను ఒక అనాలోచిత చర్యగా చంద్రబాబు అభివర్ణించటాన్ని బట్టి రెవెన్యూ వ్యవస్థపై సీఎం చంద్రబాబుకు ఉన్న అవగాహన ఏపాటిదో స్పష్టమైంది. అనేక చిక్కు­ముళ్లు, ఆటంకాలు, వ్యయ ప్రయా­సలను అధిగమించి 6 వేల గ్రామా­ల్లో పూర్తయిన రీ సర్వేను రద్దు చేస్తానని ఆయన చెప్పడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేయడమే. వివాదాలు లేని భూముల వ్యవస్థ తేవటాన్ని వ్యతిరేకించడమంటే వివాదాలు కోరుకోవడమే. తద్వారా డ్రోన్లు, విమానా­లతో మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేయడం, ప్రతి గ్రామా­నికి ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులను అందుబాటులోకి రావడం, ప్రతి రైతుకి భూహక్కు పత్రం, భూములకు జియో ట్యాగింగ్‌ హద్దులు లాంటివన్నీ వృథా అయినట్లే! ఇప్పటివరకూ సర్వే పూర్తయిన గ్రామాల్లో 10 లక్షల పట్టా సబ్‌ డివిజన్లు, 8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. అవి కూడా చంద్రబాబుకు తప్పుగానే కనిపించాయి. అన్నిటికీ మించి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. వివాదాస్పదమైన పాత భూముల వ్యవస్థనే మళ్లీ తేవాలని చంద్రబాబు నిర్ణయించడంపై రెవెన్యూ యంత్రాంగం విస్తుపో­తోంది. భూ హక్కులకు భరోసా కల్పించేలా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి రాజకీయ మకిలి అంటించి దాన్ని చంద్రబాబు చెత్తబుట్టలో వేసేశారు. ఏపీలో ఎప్పు­డూ జరగని విధంగా చేపట్టిన ఈ భూసంస్కరణ­లన్నింటిపైనా తప్పుడు ముద్ర వేసి తొలగించాలను­కోవడం మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది.ఇదేం విచిత్రం?2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి మైన్స్‌ ద్వారా ప్రభుత్వానికి రాబడి ఏటా రూ.2 వేల కోట్లు ఉంటే 2024లో ఏటా దాదాపు రూ.4 వేల కోట్లకు చేరింది. మరి ఖజానాకు ఆదాయం రెట్టింపు అయినప్పుడు రూ.19 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ చేయడం విచిత్రం కాదా? ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అయ్యావ్‌ చంద్రబాబూ! గనుల కేటాయింపుల్లో పారదర్శక విధానాలు తెచ్చి ఆదాయం పెంచిన గత ప్రభుత్వం పారదర్శకంగా పని చేసినట్లా? లేక ఆదాయం తక్కువ చేసి, పారదర్శక విధానాలు లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడినట్లా? చిన్న­పిల్లలను అడిగినా ఈ విషయం సులభంగా చెప్పేస్తారు కదా! ఇసుకపైనా అసత్యాలేఅధికారంలోకి వచ్చిన నెలన్నర వ్యవధిలోనే 40 లక్షల టన్నుల ఇసుకను బొక్కేసిన చంద్రబాబు వైఎస్సార్‌­సీపీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిపోయిందంటూ గుండెలు బాదుకోవడం గజ దొంగల్ని సైతం విస్మ­యా­నికి గురిచేస్తోంది. ఇసుక ఫ్రీ అని మభ్యపుచ్చి ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకుండా చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఖజానాకు ఏటా రూ.780 కోట్లు రాబడి తెచ్చే విధానాన్ని తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఇసుక అప్పగించింది. ఐదేళ్లలో రూ. 4 వేల కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వా­నికి రాబడి వచ్చింది. 2014–­19 మధ్య ఇసుక ఫ్రీగా ఇచ్చానని బుకాయించిన చంద్రబాబు ఎంత దోపిడీకి తెర తీశారో ఇప్పుడెంత కొల్లగొట్టనున్నారో ఆయనకే తెలియాలి మరి!!ఒక్క ఇల్లూ కట్టని చంద్రబాబు.. 31 లక్షల ఇళ్లు ఇచ్చిన జగన్‌పై విమర్శలా?దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలను సైతం చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై చంద్రబాబు బురద చల్లేందుకు సాహసించారు. పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు, 72 వేల ఎకరాల్లో 17 వేల కాలనీలు నిర్మించి పేదలకు పంచడాన్ని కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేయడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాలనీల కోసం 28 వేల ఎకరాలను సేకరించగా, మరో 25 వేల ఎకరాల ప్రైవేటు భూములను కొనుగోలు చేసి కాలనీలు కట్టించారు. అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా? పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇళ్ల యజ్ఞాన్ని అడ్డుకుని ఇప్పుడు నీతి సూక్తులు చెప్పడం విస్మయపరుస్తోంది. కనీస ఆధారాలు లేకుండా భూసేకరణలో వేల కోట్ల అవినీతి జరిగిందని సీఎం స్థాయి వ్యక్తి దిగజా­రుడు ఆరోపణలు చేయడం తగునా? 31 లక్షల మంది పేదలకు మంచి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి పది వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు కాక మరేమిటి?‘గీతం’ కబ్జాలు గుర్తులేవా?సాక్షి, విశాఖపట్నం: శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్ధా­లను ముద్రించేసిన సీఎం చంద్రబాబు విశాఖ­లో భూములు మింగేసిన అనకొండలు టీడీపీకి చెందినవేనన్న విషయాన్ని కప్పిపు­చ్చేందుకు విఫలయత్నం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చినా తప్పేనంటూ అసత్యాలు వల్లెవేశారు. టీడీపీ అనకొండల నుంచి మార్కెట్‌ ధర ప్రకారం రూ.5 వేల కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గీతం పేరుతో రూ.500 కోట్ల విలువైన 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు(ఫైల్‌) స్టూడియో భూములపై అవగాహన ఉందా? రామానాయుడు స్టూడియోను ప్లాట్ల పేరుతో ఆక్రమించి విక్రయించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు యత్నించారంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. నిజానికి స్టూడియో యజమానులే రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణతో పాటు నిబంధనలు పరిశీలించిన తర్వాతే గత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టూడియో యజమానులు దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు యత్నించారు. నిజంగానే కబ్జా జరిగితే స్టూడియో అధినేతలు ఎందుకు ఉపేక్షిస్తారనే కనీస అవగాహన లేకుండా అర్థం పర్థం లేని విమర్శలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పీఠానికి లీజుకే.. వేద పాఠశాల నిర్మా­ణం కోసం విశాఖ శారదా పీఠానికి 2022 ఫిబ్రవరి 8న 15 ఎకరాల భూమిని తక్కువ ధరకే అప్పగించేశారని, దీని వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి శారదా పీఠానికి భూమిని కేవలం లీజుకు మాత్రమే అప్పగిస్తున్నట్లు జీవో 64లో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను అనుసరించి ఎకరా రూ.లక్ష చొప్పున లీజుకు ఇస్తే శారదా పీఠానికి భూములు రాసిచ్చేసినట్లు చంద్రబాబు మభ్యపుచ్చేందుకు ప్రయత్నించారు. మరి లీజు, సేల్‌ రెండూ ఒకటి కాదనే విషయం ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా? హయగ్రీవపైనా అబద్ధాలు.. ఓల్డేజ్‌ హోమ్‌ కోసం హయగ్రీవ ల్యాండ్స్‌ 12.51 ఎకరాలను ఇస్తే వైఎస్సార్‌సీపీ నేతలు కొట్టెయ్యాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 2008 డిసెంబర్‌ 6న ప్రివిలైజ్డ్‌ మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం ఎకరం రూ.45 లక్షలు చొప్పున (ఆ సమయంలో ఎస్‌ఆర్‌వో విలువ ఎకరం రూ.28.40 లక్షలు) 12.51 ఎకరాలను కేటాయిస్తూ జీవో నం.1447 జారీ అయింది. ప్రభుత్వ ఉత్తర్వులు, కన్వేయన్స్‌ డీడ్‌ షరతుల ప్రకారం మొత్తం భూభాగంలో 10% కాటేజీల నిర్మాణానికి, 30% రోడ్లు, డ్రెయిన్లు, ఇతర నిర్మాణాలు, సౌకర్యాల కోసం వినియోగించాలి. సదరు సంస్థ జీవీఎంసీకి 2012 ఫిబ్రవరి 24న (బీఏ నం.10900/2014/డీసీపీ–1/జీ1) దరఖాస్తు చేసుకుంది. ప్లాన్‌లను ఆమోదించకపోవడంతో కలెక్టర్‌ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై జీవీఎంసీ, వుడాకు లేఖ రాసే హక్కు కలెక్టర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కరించేంత వరకూ భూమి లాక్కోకూడదని, బలవంతపు చర్యలు వద్దని, చట్ట ప్రకారం వ్యవహరించాలని హై­కోర్టు స్పష్టం చేసింది. తక్షణమే పిటిషనర్‌కు ఎన్‌వోసీ జారీ చేయాలని కలెక్టర్‌ను 2017లో ఆదేశించింది. నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు సమయంలో విధించిన షరతులకు లోబడే కన్వేయన్స్‌ డీడ్, ప్లాన్‌ను ఆమోదిస్తే చంద్రబాబు అబద్ధాలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఖనిజ వనరులను దోచుకుంది ఎవరు?ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఆదాయం జగన్‌ హయాంలో అనూ­హ్యంగా పెరిగింది.2020–21లో రూ.502 కోట్లు ఉన్న ఆ సంస్థ ఆదాయం 2022–­23 సంవత్సరానికి రూ.1,806 కోట్లకు చేరింది. 2023–24 నాటికి రూ.4 వేల కోట్లకు చేరడాన్ని బట్టి మైనింగ్‌ ఆదాయాన్ని జగన్‌ ప్రభుత్వంలో ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో గనుల ఆదాయం తగ్గిపోయి అప్పట్లో గనుల దోపిడీ యధేచ్చగా జరిగిపోయిందని స్పష్టమవుతోంది. గనుల్ని ఇష్టానుసారంగా దోచుకు తిన్నది టీడీపీ నేతలే. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు లేటరేట్‌ కొండల్ని తొలిచేశారు! రోడ్డు మెటల్‌ తవ్వకాలతో నర్సీపట్నం పరిసర ప్రాంతాలను లోయలుగా మార్చేసిన ఘనత అయ్యన్నదే! మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలిలో చేసిన గనుల దోపిడీ అంతా ఇంతా కాదు. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు గ్రానైట్‌ మాఫియాగా మారి దోచుకున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక కొత్త గనుల విధానం ద్వారా ఆదాయం పెరిగేలా చేశారు. రాయల్టీ వసూళ్లలోనూ కొత్త మార్గదర్శకాలు ప్రవే­శపెట్టారు. అరకొరగా ఉన్న మైనింగ్‌ సిబ్బంది వల్ల సీనరేజీ వసూళ్లు సరిగా జరగడంలేదని గుర్తించి ప్రైవేటు సంస్థలకు పారదర్శకంగా కాంట్రాక్టులు ఇచ్చారు. లీజుల జారీ విధానాన్ని అందరికీ అను­కూ­లంగా ఉండేలా మార్చారు. వీటన్నింటి ఫలితంగానే ఆదాయం పెరిగింది.

Chandrababu Govt Neglect On Poor Students Medical Education
జగన్‌ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి

రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీలో సభ్యులు కోరగా.. ‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు.ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు సాధ్యపడదు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తున్నాం’ అంటూ అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కరాఖండిగా తేల్చి చెప్పారు. ఒక్క వైద్య కళాశాలకే అప్పట్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచీగా చూపి చేతులెత్తేశారు. ప్రైవేటు కళాశాలల ద్వారా దోపిడీకి తెరలేపారు. అలాంటిది కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక పరిస్థితి కుదేలైనప్పటికీ, ఆ సంక్షోభాన్ని అధిగమించి ఏకంగా 17 కళాశాలల నిర్మాణం ప్రారంభించిన ఘనత ఒక్క వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. వైఎస్‌ జగన్‌ దీక్ష, దక్షతలకు ఈ కళాశాలలు ఓ నిదర్శనం.సాక్షి, అమరావతి: వైద్య విద్యనభ్యసించాలన్న అభిలాష ఉండి, ప్రైవేటు కాలేజీల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తల్లడిల్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యనందించి, వారి కలను సాకారం చేయాలన్నది వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్ష. అందుకే 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్య తరగతి పిల్లల వైద్య విద్య కల నెరవేరుతుంది. అంతేకాదు.. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసం చేయలేని ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. మరోపక్క నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరతకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసూయ, పేద వర్గాలపై ఆయనకున్న ద్వేషానికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలవుతోంది.2,550 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూర్చేలా 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవి. ఇవి పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు సరిపోవు. ఈ వర్గాల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేరి్పంచేవారు. వారి కలలను నిజం చేయడానికి వైఎస్‌ జగన్‌ కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు సమకూర్చారు. నిర్మాణాలూ వేగంగా చేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగరం జిల్లాకూ వైద్య కళాశాల రావడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 1979లో ఏర్పాటైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇదే తొలి ప్రభుత్వ వైద్య కళాశాల. దీంతో ఈ జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం వ్యయప్రయాసలకోర్చి విశాఖపట్నంకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థుల అకడమిక్‌ కార్యకలాపాల కోసం లెక్చర్‌ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్‌ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడేనాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. క్రెడిట్‌ జగన్‌కే దక్కుతుందనిఈ ఏడాది మరో 5 కొత్త కళాశాలలు ప్రారంభమైతే ఆ ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబు అధికారాన్ని చేపట్టగానే వైద్య కళాశాలల ఏర్పాటు అంశాన్నే విస్మరించారు. దీంతో గత నెల 25న ఎన్‌ఎంసీ ఐదు కళాశాలల్లో తనిఖీలు చేసి, అనుమతులు నిరాకరించింది. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రావాల్సిన 500 సీట్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం. పైగా, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బీజేపీ నేతే. కేంద్రంలోనూ టీడీపీ అధికారాన్ని పంచుకుంటోంది. ఇలా ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కనీసం వైద్య కళాశాలలకు అనుమతులు కూడా రాబట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే సీఎస్‌ మార్పు, ఇతర అధికారులను పక్కన పెట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలలపై ఇసుమంతైనా చూపలేదు. అన్ని వసతులను, 70 నుంచి 90 శాతం మేర వైద్య, వైద్యేతర సిబ్బందిని అందుబాటులో ఉంచింది. కొత్త ప్రభుత్వం మిగిలిన వైద్యులు, సిబ్బందిని నియమించి ఉంటే కళాశాలలకు తప్పనిసరిగా అనుమతులు లభించి ఉండేవని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాస్త పనినీ చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వల్ల రాష్ట్రానికి నష్టమే జరిగింది. ఎన్‌ఎంసీ అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇప్పటికీ ఉంది. ఇందుకు వైద్య శాఖ సిద్ధంగానే ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియా నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు చూస్తే వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన మిగిలిన ఏడు కళాశాలలనూ అటకెక్కిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ కళాశాలలపై చంద్రబాబు అసహనం ఎప్పుడూ ప్రైవేటు వైపే మొగ్గు చూపే సీఎం చంద్రబాబుకు పేద, మధ్య తరగతుల ఊసే పట్టదు. టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాలా నిర్మించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి చొరవతో రిమ్స్‌ల రూపంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ పాలనలోనే ప్రభుత్వ రంగంలో వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. ప్రభుత్వమే ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు కూడా జీర్ణించుకొలేరు. ఇటీవల వైద్య కళాశాలలపై జరిగిన సమీక్షలో ఆయన తీరు స్పష్టంగా ప్రదర్శితమైనట్లు సమాచారం. వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ ఏమిటంటూ చంద్రబాబు ఈ సమావేశంలో ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని రివర్స్‌లో సీఎం ప్రశ్నించడంతో అధికారులు విస్తుబోయారని సమాచారం. డబ్బున్నవారికే విద్య సొంతమయ్యేలా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత చదువులు దక్కకూడదనే విధంగానే టీడీపీ, చంద్రబాబు తీరు ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. డబ్బున్న వారికే వైద్య విద్య సొంతమయ్యేలా 2019కు ముందు టీడీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. అప్పట్లో పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎంబీబీఎస్‌ చదివిన వారు పీజీ కోర్సులు చేయడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. పీజీ కోర్సుల ఫీజులను అమాంతంగా పెంచేశారు. యాజమాన్య కోటా అటుంచితే కన్వీనర్‌ కోటా సీట్లు కూడా పేద, మధ్య తరగతికి దక్కకుండా ఫీజులను పెంచారు. అప్పటివరకూ కన్వీనర్‌ కోటాలో క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రైవేట్‌ కళాశాలల్లో రూ. 2.90 లక్షలుగా ఉన్న ఫీజును, 2017–18లో ఏకంగా రూ.6.90 లక్షలకు పెంచారు. యాజమాన్య కోటా ఫీజను రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచారు. దీంతో పేద విద్యార్థులకు కన్వీనర్‌ కోటా కూడా దక్కకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను 40 నుంచి 50 శాతం వరకు తగ్గించారు. నిరుపేద, మధ్యతరగతి వారికి భారీ ఊరట కల్పించి అండగా నిలిచారు.

Farmers crop loan waiver based on ration cards
'రేషన్‌' ఉంటేనే మాఫీ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్‌ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్‌ (రేషన్‌) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్‌ అకౌంట్‌ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్‌ అధికారిగా (బీఎస్‌ఐ) నియమించాలి. ఆ నోడల్‌ అధికారులు తమ బ్యాంక్‌ పంట రుణాల డేటాపై డిజిటల్‌ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ (సీబీఎస్‌) నుంచి.. రిఫరెన్స్‌–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్‌ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్‌–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్‌ఐసీ డేటా వ్యాలిడేషన్‌ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్‌ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్‌ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్‌ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్‌ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్‌ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్‌ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి.

Girl missing during TDP rule but Pawan was silent: AP
గిరిజన బాలిక ఎక్కడ బాబూ?

రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. – ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాష్ట్రంలో 34వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు. వలంటీర్లు ఎత్తుకుపోయారు. వాళ్ల ఆచూకీ తెలియాలి. మేం అధికారంలోకి వస్తే అదృశ్యమైన బాలికలను సురక్షితంగా వెనక్కి రప్పిస్తాం. – ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్‌ సాక్షి, అమరావతి/నందికొట్కూరుగత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి పది రోజులైంది. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు.ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మీడియాకు లీకులివ్వడం విడ్డూరంగా ఉంది. వారంరోజులుగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు సాగిస్తున్న డ్రామా వెనుక పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. బాలిక అదృశ్యం వెనుక ఉన్న టీడీపీ పెద్దల కుటుంబ సభ్యులను కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముగ్గుర్ని అరెస్టుచేశామని హోంమంత్రి అనిత సోమవారం చెప్పగా.. నంద్యాల పోలీసులు మాత్రం అరెస్టుచేసినట్లు చెప్పనేలేదు. అంటే ఆ ముగ్గుర్ని అరెస్టు చూపించడం ద్వారా అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నిందన్నది సుస్పష్టమవుతోంది. బాలిక తల్లిదండ్రుల మొర వినిపించిందా?అదృశ్యమైన గిరిజన బాలిక ఎక్కడుంది చంద్రబాబు? మీరు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అయిదో తరగతి విద్యార్థిని ఈనెల 7న అదృశ్యమైందనే విషయం తెలుసా అసలు? శ్వేతపత్రాల పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే హడావుడిలో ఉన్న మీకు ‘మా అమ్మాయిని సురక్షితంగా తీసుకురండి.. కనీసం బతికుందో లేదో చెప్పండి’.. అన్న ఆమె తల్లిదండ్రుల మొర వినిపించనే లేదు. కనీసం హోంమంత్రిని పంపించి ధైర్యం చెప్పాలనిపించలేదు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డితోనైనా ధైర్యం చెప్పించారా? ఈ ఒక్క బాలికనైనా తీసుకురండి పవన్‌..రాష్ట్రంలో వలంటీర్లు ఏకంగా 34వేల మంది బాలికలను అదృశ్యం చేశారని ఎన్నికల ముందు నానా యాగీ చేసిన పవన్‌.. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నోరెందుకు మెదపడంలేదు!? తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు ప్రాథేయపడుతు­న్నారు. మరి మీరెందుకు ఆ బాధిత తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు? పోలీసు అధికారులను ఎందుకు ప్రశ్నించలేదు? గిరిజన బాలిక విషయంలో మీరెందుకు చిత్తçశుద్ధి చూపించలేదు? ఈ ఒక్క బాలికనైనా తీసుకొచ్చి చూపించండి పవన్‌!దర్యాప్తు పక్కదారి పట్టిస్తున్న పోలీసులు..ఇక గిరిజన బాలిక అదృశ్యం కేసును పోలీసు శాఖ ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈనెల 7న ఉదయం నుంచి బాలిక కనిపించడంలేదు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండ్రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారం రోజులుగా విచారిస్తున్నారు. అయినా, బాలిక ఆచూకీపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది.ఎందుకంటే ఆ ముగ్గురే బాలికను అత్యాచారం చేసి హత్యచేసినట్లు పోలీసులే మీడియాకు లీకులివ్వడం ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహం కోసం పోలీసుల గాలింపు సందేహాస్పదంగా ఉంది. నిందితులు చెప్పారంటూ మూడుచోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం చేసిన హడావుడితో ఈ కేసులో అసలు దోషులను కాపాడేందుకు సిద్ధమైందన్నది తేలిపో­యింది.బాలిక అదృశ్యం వెనుక కొందరు టీడీపీ ప్రజా­ప్రతినిధి కుటుంబ సభ్యులుగానీ సన్నిహితుల పాత్రగాని ఉందని ముచ్చుమర్రిలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాలిక సురక్షితంగా ఉందా.. అత్యాచారం చేశారా.. హత్య చేశారా అన్నది ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. ముగ్గురు నిందితులు అరెస్టు : హోంమంత్రిఇక నంద్యాల జిల్లాలో గిరిజన బాలిక ఘటన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేశామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాలిక మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదని ఆమె సోమవారం మీడియాకు చెప్పారు. ఈ ఘటనలో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, విజయనగరం జిల్లాలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంగా చంద్రబాబు ప్రకటించారని ఆమె తెలిపారు. మరోవైపు.. నంద్యాల జిల్లా పోలీసులు మాత్రం నిందితులను అరెస్టుచేసినట్లు సోమవారం అర్థరాత్రి వరకు వెల్లడించలేదు.చంద్రబాబు, పవన్‌పై జనాగ్రహం..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇప్పటివరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వారెందుకు మౌనం వహించారని ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామానికి కూతవేట దూరంలో బాలిక అదృశ్యమై పది రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో లా అండ్‌ ఆర్డర్‌ అంటే ఇదేనా పవన్‌ అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లభించకపోవడం విడ్డూరం.ఆ ముగ్గుర్ని చంపేయాలిపది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’.. అని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు.

Supreme Court To Consider Setting Up Constitution Bench For Pleas Against Validity Of Passage Of Laws
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి

న్యూఢిల్లీ: ఆధార్‌ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్‌డీఏ సర్కార్‌ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పారి్ధవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్‌ చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్‌ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్‌ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్‌110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్‌ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్‌ రిటైర్‌ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్‌ చేశారు. ఆధార్‌ చట్టం, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే.

USA Presidential Elections 2024: I was saved by luck or God says Donald Trump
Donald Trump: చనిపోయాననే అనుకున్నా

మిల్వాయుకీ (డెలావెర్‌): ప్రాణాంతకమైన దాడికి గురైన క్షణాలను అమెరికా మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా. కేవలం అదృష్టమో, దైవమో నన్ను కాపాడాయి’’ అని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా 20 ఏళ్ల దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడటం తెలిసిందే. 78 ఏళ్ల ట్రంప్‌ కుడి చెవికి తూటా గాయంతో త్రుటిలో బయటపడ్డారు. తనను రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించే మూడు రోజుల పార్టీ జాతీయ సదస్సుకు వెళ్తూ ఆయన న్యూయార్క్‌ పోస్ట్‌ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిగ్గా కాల్పులు జరిగిన సమయంలోనే కుడివైపుకు తల తిప్పడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీన్ని నమ్మశక్యం కాని అనుభవంగా అభివరి్ణంచారు. ‘‘గాయం తర్వాత పిడికిలి పైకెత్తి ఫైట్‌ అంటూ నేను నినదిస్తున్న ఫొటోను అంతా ఐకానిక్‌ ఫొటోగా అంటున్నారు. అలాంటి ఫొటో కావాలంటే మామూలుగానైతే చనిపోవాల్సిందే’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్‌ తనకు ఫోన్‌ చేసి క్షేమం కనుక్కున్న తీరును అభినందించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ కుడి చెవికి బ్యాండేజీ ధరించి కని్పంచారు. రిపబ్లికన్‌ సదస్సుకు భారీ భద్రత రిపబ్లికన్ల మూడు రోజుల జాతీయ సదస్సు మిల్వాయుకీలో సోమవారం మొదలైంది. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో సదస్సుకు కనీవినీ ఎరగని స్థాయిలో వేలాది మంది సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు.పోలీసును బెదిరించాడు!ట్రంప్‌పై దాడికి దిగిన క్రూక్స్‌ కదలికల్ని కాల్పులకు ముందే ఓ పోలీసు అధికారి పసిగట్టాడు. క్రూక్స్‌ నక్కిన గోడౌన్‌పైకి ఎక్కి అతన్ని సమీపించబోగా తుపాకీతో బెదిరించాడు. దాంతో ఆ పోలీసు కిందికి దిగేశాడు. అదే సమయంలో ట్రంప్‌పై క్రూక్స్‌ తూటాల వర్షం కురిపించాడు. స్కూలు రోజుల నుంచీ ముభావేక్రూక్స్‌ స్కూలు రోజుల నుంచీ ఒంటరిగా, ముభావంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ‘‘క్రూక్స్‌కు పెద్దగా మిత్రులు కూడా లేరు. తోటి విద్యార్థులంతా అతన్ని బాగా ఏడిపించేవారు. రైఫిల్‌ గురి పెట్టడం చేతగాక స్కూల్‌ షూటింగ్‌ టీమ్‌లోకి ఎంపిక కాలేకపోయాడు’’ అన్నారు.జగన్నాథుడే కాపాడాడు: ఇస్కాన్‌ప్రాణాంతక దాడి నుంచి ట్రంప్‌ను పురీ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్‌ పేర్కొంది. 48 ఏళ్ల కింద న్యూయార్క్‌లో తొలి జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారని చెప్పింది.పోలీసుల తప్పిదమే: ఎఫ్‌బీఐ ట్రంప్‌పై దాడి ఉదంతంపై దర్యాప్తు ముమ్మరమైంది. దీనిపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు బైడెన్‌ ఆదేశించడం తెలిసిందే. దేశీయ ఉగ్రవాద చర్యగా దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. దుండగుడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ ఒంటరిగానే ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచి్చంది. భద్రతా లోపానికి స్థానిక పోలీసు విభాగానిదే బాధ్యత అని సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం వాదిస్తోంది. క్రూక్స్‌ మాటు వేసిన గోడౌన్‌ తమ భద్రతా పరిధికి ఆవల ఉందని పేర్కొంది. కనుక అదంతా స్థానిక పోలీసుల బాధ్యతేనని వివరించింది.

TDP Leaders Attacked YSRCP Workers In Andhra Pradesh
కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్య­కర్తలు దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి అరాచకాలు ఆదివారం రాత్రి, సోమవారం కొన­సా­గాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య­కర్త­లపై వేట కొడవళ్లతో దాడిచేశారు. హోటల్‌ ధ్వంసం చేశారు. షెడ్డు కూల్చేస్తామని నోటీసు ఇప్పించారు. రియల్టర్లను బెదిరించారు. – సాక్షి నెట్‌వర్క్‌⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ముచ్చు­రామి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు క్రిష్టయ్య, బాలచంద్ర వేట కొడవళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం తమ పొలంలో తెగిపడిన మోటర్‌ తీగలను విద్యుత్‌శాఖ అధికారులతో సరిచేస్తు­న్నారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బాల­చంద్ర, క్రిష్టయ్య.. రామకృష్ణారెడ్డి, పక్కనున్న నరేంద్రరెడ్డితో గొడవకు దిగారు. గొడవ తీవ్ర­మై పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ నేప­థ్యంలో బాలచంద్ర, క్రిష్టయ్య వేట కొడవళ్లతో రామకృష్ణా­రెడ్డి, నరేంద్రరెడ్డిపై వేట కొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.⇒ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి పంచాయతీ మహదేవపురం ఎస్సీ కాలనీలో వైఎ­స్సార్‌సీపీ కార్యకర్త కంకిపాటి వెంకటేశ్వరరావు షెడ్డు­ను వెంటనే తొలగించాలని పంచాయతీ వారు నోటీసు ఇచ్చారు. వెంకటేశ్వరరావు తండ్రి సత్తియ్య సుమారు 40 ఏళ్ల కిందట గ్రామంలోని ప్రభుత్వ­భూమిలో పశు­వుల పాక నిర్మించుకున్నారు. సత్తియ్య మరణా­నంతరం ఆ స్థలం అతడి కుమారుడు వెంక­టే­శ్వరరావు ఆధీనంలో ఉంది. వెంకటేశ్వరరావు ఇటీవల ఆ స్థలంలో షెడ్డు నిర్మించారు. వెంటనే ఆ షెడ్డును తొల­గించాలని పంచాయతీ కార్య­దర్శి రామలక్ష్మి ఈ­నెల 11న , మళ్లీ సోమవారం పంచాయతీ గుమాస్తా, సచివాలయ మహిళా పోలీస్‌ మరో నోటీసు ఇచ్చారు.వెంకటేశ్వర­రావు ఇంటిపక్కన అదే ఆక్రమిత భూమి­లో ఉన్న టీడీపీ కార్యకర్త భీమడోలు కృష్ణకు పంచాయతీ వారు నోటీసు ఇవ్వలేదు. తనకే నోటీసు ఎందుకిచ్చారని పంచాయతీ అధికారులను ప్రశ్నించగా.. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నోటీసులు ఇస్తున్నా­మన్నారని వెంకటేశ్వరరావు చెప్పారు. వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో తన కుమారుడు సతీష్‌ పాల్గొన­డం వల్లే టీడీపీ నేతలు కక్ష సాధిస్తు­న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సోమవారం వైఎస్సార్‌సీపీ అభిమాని ముజావర్‌ సైదావలిపై టీడీపీ వర్గీయుడు ముజావర్‌ బాజి దాడిచేశాడు. రోడ్డు మీద ఎదురొచ్చిన సైదావలిని దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళల్ని దూషించాడు. ఈ దాడిపై సైదావలి ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ⇒ వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని స్విస్ట్‌ కళాశాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వద్ద టీడీపీ నాయకులు హడావుడి చేశారు. వెంచర్‌ మేనేజర్, సూపర్‌వై­జర్ల­ను భయభ్రాంతులకు గురిచేసి పనుల­ను నిలిపేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అనుమతి తీసుకుని వెంచర్లు వేయాలని హెచ్చరించారు. టీడీపీ నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వీరకుమార్‌రెడ్డి, మావిరెడ్డి, మరో నలుగురు తమ అనుమతులు లేకుండా పనులు చేస్తే టిప్పర్లు, జేసీబీలను పెట్రోల్‌ పోసి కాల్చేస్తామని హెచ్చరించారని సదరు కాంట్రాక్టర్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ⇒ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ నాయకుడు సుభాని హోటల్‌ను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన యువకులు టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌ రోడ్డులోని హోటల్‌లో సామగ్రిని, ఆహారాన్ని రోడ్డుమీదకు విసిరేసి సుమారు రెండుగంటల పాటు వీరంగం చేశారు. అడ్వాన్స్‌ తీసుకుని సకాలంలో మటన్‌ ఇవ్వనందుకు మూడునెలల కిందట చినరావూరుతోటలోని మాంసం వ్యాపారి మక్బుల్‌ను సుభాని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న మక్బుల్‌ ఆదివారం రాత్రి కొందరు యువకులతో కలిసి సుభాని హోటల్‌పై రాళ్లతో దాడి­చేశాడు. సుభాని బుల్లెట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో యువ కుడు మహబూబ్‌కు గాయాలవగా 108లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు తాము వహాబ్‌­చౌక్‌లోని ఓ హోటల్‌ నుంచి ఆహారం తీసుకెళుతుండగా సుభాని, అతడి హో­టల్‌లో పనిచేసేవారు తమపై దాడి­చే­శా­రని మక్బుల్‌ వర్గీయులు చెబుతున్నారు.

Sakshi Editorial On US Politics and Attack On Donald Trump
మారకుంటే... ముప్పు

రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్‌ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్‌ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్‌ లింకన్, జాన్‌ ఎఫ్‌. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్‌ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్‌ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్‌ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్‌ క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్‌ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్‌ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్‌ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్‌ నాటి ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్‌ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం.

EX Minister Meruga Nagarjuna Strong Counter to Chandrababu Fake Allegations
బాబు శ్వేతపత్రం ఓ బూటకం

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బూట­­కమని, అబద్ధాలతో కూడి­న నిందల పత్రమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపి, అనరాని మాటలు అనడానికే ఈ తంతు సాగించారని మండిపడ్డారు.ఆయన సోమవారం తాడే­పల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదం వంటి పదజాలం వాడ­టంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం స్థానంలో ఉన్న బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్‌బులిటీ ఉంటుందన్న విషయా­న్ని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలోని ప్రతి అంశం టీడీపీ వారికి సంబంధించినవేనని చెప్పారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించడానికేచంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ఇప్పుడు ఇస్తున్న పథకాలను కూడా ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నిక­లప్పుడు ఈ విషయం తెలియదా? హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే శ్వేతపత్రాల తంతు తీసుకొచ్చారు. బాబు మోసాలను ప్రజలు గమని­స్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకు­డు జగన్‌ మాత్రమేనని, అలా నిలబడలేకే బాబు దూష­ణలకు పరిమితమయ్యారు.దసపల్లా భూము­లు ప్రభుత్వానివి కావని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా దాన్ని పట్టుకుని బాబు నిస్సి­గ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని మాట్లా­డు­తున్న చంద్రబాబు గీతం కాలేజీ అక్రమాలపై ఎందుకు నోరెత్తరు? వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీ­వీఎస్‌ మూర్తి స్వాహా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందులో 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడరు?ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలువైఎస్‌ జగన్‌ నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. వైఎస్‌ జగన్‌ 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకిచ్చా­రు. మరో 25వేల ఎకరాలు అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్ర­బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి సెంటు భూమైనా ఇచ్చారా? పైపెచ్చు కేసులతో అడ్డుకున్నారు. రాజధానిలో 52 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకు­న్నారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించే దమ్ము బాబుకు ఉందా?ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దు చేయించండిల్యాండ్‌ రీసర్వే, టైట్లింగ్‌ చట్టంపైనా చంద్రబాబు అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లా­డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్ని­కల్లో లబ్ధి పొందారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది సరైంది కాదని అనుకుంటే, బాబే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దోపిడీఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను దోచుకుంటున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి సీనరేజ్, రవాణా చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదీ గర్భాల్లో ఉన్న ఇసుకను కొల్లగొట్టిన గజదొంగలు కూడా బాబు పార్టీ మనుషులే. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫాం మీద టెండర్లు పిలిచారు. మా ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు, ఐదేళ్లలో రూ.3,825 కోట్లు ఆదాయం వచ్చింది.గతంలో బాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? దశా­బ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది బాబు మనుషులే. ఆయన హయాంలో మైన్స్‌పై ఆదాయంలో పెరుగు­దల (సీఏజీఆర్‌) 17 శాతం నమోదైతే, వైఎస్‌ జగన్‌ హయాంలో 40 శాతం. అంటే దోపిడీ బాబు మనుషులు చేసినట్టు కాదా? బాబు హయాంలో నిరుపేదలకు ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇవ్వలేదు.పైగా రికార్డు­ల్లో క్లారిటీ లేదంటూ లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చారు. దీంతో ఆ భూములపై హక్కులు దక్కక, ఆపత్కా­లంలో అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయి. అందుకే జగన్‌ చుక్కల భూములు, నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించి, అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు­లు కల్పించి, మేలు చేశారు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

title
టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

title
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

title
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..!

బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all