యువతి నుంచి ఫోన్‌.. కొరియర్‌ ఓపెన్‌ చేస్తే స్వీట్‌ బాక్స్.. అసలేం జరిగింది?

Online delivery Scam: Dubbaka Man Got Sweet Box Instead Of Mobile - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ అంటూ.. స్వీట్‌బాక్స్‌ పంపిన వైనం 

సాక్షి, మెదక్‌:(దుబ్బాక): సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కు స్పందించి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తుప్పటి కనకయ్యకు రెండు రోజుల క్రితం ఓ అపరిచిత యువతి ఫోన్‌ చేసింది. మీ సెల్‌ నంబర్‌కు ఆఫర్‌ వచ్చిందని, రూ.1600లు చెల్లిస్తే రూ.7500 విలువచేసే స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని చెప్పింది.

కొరియర్‌ ద్వారా మీ ఇంటికి ఫోన్‌ వచ్చాకే డబ్బులు చెల్లించమంటూ నమ్మకం కలిగించడంతో కనకయ్య ఇంటి అడ్రస్‌ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం పోస్ట్‌ రావడంతో డబ్బులు చెల్లించి పార్సిల్‌ను తీసుకున్నాడు. ఓపెన్‌ చేసి చూడగా స్మార్ట్‌ ఫోన్‌ బదులు స్వీట్‌ బాక్స్, హనుమాన్‌ చాలీసా, యంత్రం ఉండడంతో ఖంగు తిన్నాడు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  
చదవండి: ఆదిలాబాద్‌: మారుమూల గ్రామ సర్పంచ్‌కి ఢిల్లీ నుంచి ఆహ్వానం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top