తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు

Official: Schools Reopen In Telangana From February 1St - Sakshi

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

కరోనా నిబంధనల అమలు, శానిటేషన్‌ తప్పనిసరి

‘ఆన్‌లైన్‌’ ఉంటుందో లేదో స్పష్టత కరువు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు మూడు వారాల విరామం తర్వాత రాష్ట్రంలో విద్యా సంస్థలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. అన్ని విద్యా సం స్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి యథావిధిగా పని చేస్తాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సం స్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిం చాలని, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సబిత స్పష్టం చేశారు.

ఈ దిశగా పాఠ శాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. కరోనా మూడో వేవ్‌ పెరుగుతుండటంతో షెడ్యూల్‌ కన్నా ముందే జనవరి 8 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కేసులు ఎక్కువవడంతో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించింది. దీనిపై విద్యావేత్తల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కోవిడ్‌ తీవ్రత అంతగా లేనప్పుడు.. షాపింగ్‌ మాల్స్, ఇతర వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్న ప్పుడు విద్యా సంస్థలను మూసేయడం సరికాదన్న వాదన తెరమీదకొచ్చింది. 

వైద్య, విద్యా శాఖల నివేదికల ప్రకారం..
విద్యా సంస్థలను ఈ నెల 31 నుంచి తెరిచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావించింది. దీనిపై వైద్య, విద్యా శాఖల నుంచి నివేదికలు కోరింది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా ప్రజలపై అంతగా ప్రభావం చూపట్లేదని, త్వరగానే కోలు కుంటున్నారని, కరోనా నిబంధనలతో విద్యా సంస్థలు నడుపుకోవచ్చని వైద్య శాఖ తెలిపింది. విద్యా సంస్థల్లో అవసరమైన పారిశుధ్య కార్య క్రమాలు చేపట్టాలని, దీనికి స్థానిక సంస్థల తోడ్పాటు అవసరమని, ప్రభుత్వ హెచ్‌ఎంలే ఈ నిర్వహణ బాధ్యత చూడాలని విద్యా శాఖ తెలి పింది. ఈ నివేదికల ఆధారంగా గతంలో మాదిరి క్లాసులు నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలే ఇప్పుడూ అమలులో ఉంటాయని విద్యా శాఖ అ«ధికారులు తెలిపారు. 

ఆన్‌లైన్‌ వెసులుబాటు ఉంటుందా?
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన సాగింది. 8 నుంచి 10 వరకు  విద్యార్థులకు డీడీ, టీ–శాట్‌ ద్వారా పాఠలు వినే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రైవేటు స్కూళ్లు జూమ్, గూగుల్‌ మీట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధన చేశాయి. ఇంటర్, ఆపై కాలేజీ విద్యార్థులకూ ఆన్‌లైన్‌ బోధన సాగుతోంది. అయితే స్కూళ్లు మొదలయ్యాక ఈ వెసులుబాటు ఉంటుందా లేదా అని ప్రభుత్వం చెప్పలేదు. దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. స్కూలు విద్యార్థులు యూ ట్యూబ్‌ ద్వారా ఎప్పుడూ పాఠాలు వినే వీలుందన్నాయి. కాగా, విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌ నిర్ణయంపై ట్రస్మా, పీఆర్‌టీయూ, యూటీఎఫ్‌ సహా పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top