స్మితా సబర్వాల్‌కు నోటీసులు | Notices to Smita Sabharwal | Sakshi
Sakshi News home page

స్మితా సబర్వాల్‌కు నోటీసులు

Apr 17 2025 12:44 AM | Updated on Apr 17 2025 12:44 AM

Notices to Smita Sabharwal

గచ్చిబౌలి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో చేసిన రీట్వీట్‌కు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీచేశారు. కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లో టీజీఐఐసీ చేపట్టిన చదును పనులపై అనేక మంది సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలు ప్రచారం చేశారని ఇప్పటికే పలువురిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌లో వరుసగా ఉన్న జేసీబీల ఎదురుగా నిలబడి ఉన్న జింకలు, నెమళ్లు ఉన్న ఫొటోను ఆమె రీట్వీట్‌ చేశారు. మార్చి 31న చేసిన ఈ రీట్వీట్‌పై స్మితా సబర్వాల్‌కు ఏప్రిల్‌ 12న గచ్చిబౌలి పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్‌ 179 సెక్షన్‌ కింద నోటీసులు జారీచేశారు. నోటీసుకు సమాధానం ఇవ్వాలని మాత్రమే నోటీసులిచ్చామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement