తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్‌ ఆఫీసు పైకప్పు | Nirmal Urban Urban Tehsildar Building Roof Collapsed | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్‌ ఆఫీసు పైకప్పు

Aug 26 2022 1:53 PM | Updated on Aug 26 2022 1:57 PM

Nirmal Urban Urban Tehsildar Building Roof Collapsed - Sakshi

సాక్షి, నిర్మల్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్‌ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement