
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో రికార్డులు బద్దలయ్యాయి. భూముల వేలంలో సరికొత్త రికార్డు ధర లభించింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా రూ.177 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ సంస్థ వేలం పాట పాడింది.
TGIIC నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను MSN రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, MSN రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు.