కొత్త వేరియంట్‌ ప్రభావం భారత్‌పై తక్కువే

New Omicron variants not causing significant rise in india - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు.

గతంలో ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్‌–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్‌ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్‌ వచ్చినప్పుడు బూస్టర్‌ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top