Naveen Murder Case: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక

Naveen Murder Case: Hari Girl friend Niharika Got Bail From Court Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో నిందితురాలు నిహారికకు కోర్టు బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె చర్లపల్లి జైలు నుంచి విడుదల కానుంది. ఈ కేసులో హరిహరకృష్ణ A1 , హరి స్నేహితుడు హాసన్ A2 కాగా, A3గా నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య కేసులో.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పకపోవడం.. నిందితుడికి తాము సాయం చేసినట్లు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు అంగీకరించారు. అంతే కాకుండా యువతి హత్యానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు, సందేశాలను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేసింది.

దీంతో  నిహారిక, హరి స్నేహితుడు హసన్‌లు నిందితులుగా చేర్చి ఫిబ్రవరి 6వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులు ఇద్దరని హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఇటీవల నిహారిక బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top