ఆదిలాబాద్‌ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టేందుకు కృషి | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టేందుకు కృషి

Published Tue, Feb 6 2024 1:45 AM

Narsa Reddy condolence meeting at Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవలు చేసిన  మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్‌ జిల్లాకు పెట్టేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని  నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నర్సారెడ్డి సంతాప సభలో మాజీ మంత్రులు జానారెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ మహే ష్‌కుమార్‌గౌడ్, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఎన్నో పద వులు చేపట్టిన నర్సారెడ్డి  సిద్ధాంతం, విలువల కోసం ఎప్పు డూ పాటు పడేవారని కొనియాడారు. మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నర్సారెడ్డి శాసనసభ ఐక్య వేదిక ఫోరాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేశారని, అలాగే కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. వీహెచ్‌ మాట్లా డుతూ నర్సారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు.

మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ నర్సారెడ్డి నియమ, నిబద్ధతతో కాంగ్రెస్‌ పార్టీలో పని చేశారన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేశారనీ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో రెవెన్యూ మంత్రిగా తన భూమిని పేదలకు త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

 
Advertisement
 
Advertisement