జర్నలిస్టులకు నిర్మాతలు చేయూత ఇవ్వాలి : తలసాని

Movie Producers Should Give Fund To Journalists: Talasani Srinivas Yadav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద ఆస్తి. సినిమా జర్నలిస్టులకు చేయూత ఇచ్చేందుకు ప్రతి నిర్మాత కనీసం ఒక లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్‌ కింద పెడితే బాగుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ‘తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌’(టీఎఫ్‌జేఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, హీరో చిరంజీవి, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ‘టీఎఫ్‌జేఏ’ సభ్యులకు మెంబర్‌షిప్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను అతిథుల చేతుల మీదుగా అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.ఐదు లక్షలు విరాళం ప్రకటించారు. నటుడు చిరంజీవి మాట్లాడుతూ... ‘నేను ‘ప్రాణం ఖరీదు’సినిమా చేస్తున్నప్పుడు నా గురించి ఓ ఆర్టికల్‌ రాస్తే బాగుండని కోరుకున్న.

ఆ సమయంలో చెన్నైలోని ఓ జర్నలిస్ట్‌ నా గురించి రాసినప్పుడు చాలా ఆనందపడ్డా. ఆ జర్నలిస్టు (దివంగత పాత్రికేయుడు పసుపులేటి రామారావు)ను పిలిచి థ్యాంక్స్‌ చెప్పాను’అని గుర్తు చేసుకున్నారు. కరోనా వేళ పరిశ్రమలోని 24క్రాఫ్ట్స్‌కి ‘కరోనా క్రైసిస్‌ చారిటీ’(సీసీసీ) పెట్టినప్పుడు సినిమా జర్నలిస్టులను కూడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. తాము చేసింది చాలా తక్కువని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

ప్రెసిడెంట్: వి లక్ష్మీనారాయణ

ఉపాధ్యక్షులు
1. ఎం చంద్ర శేఖర్
2. జి శ్రీనివాస్ కుమార్

జనరల్ సెక్రటరీ: వై జె రాంబాబు

జాయింట్ సెక్రటరీలు
1. జి వి రమణ
2. వంశీ కాకా

కోశాధికారి
నాయుడు సురేంద్ర కుమార్

కార్య నిర్వాహక కమిటీ
1. పి రఘు
2. వై రవిచంద్ర
3. జి జలపతి
4. కె ఫణి
5. కె సతీష్
6. రెంటాల జయదేవ్
7. వడ్డి ఓం ప్రకాష్
8. సురేష్ కొండేటి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top