ఇరిగేషన్‌ అధికారులపై మంత్రి ఉత్తమ్‌ అసహనం.. సీరియస్‌ వార్నింగ్‌! | Minister Uttam Kumar Reddy Serious On Irrigation Dept Officials | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ అధికారులపై మంత్రి ఉత్తమ్‌ అసహనం.. సీరియస్‌ వార్నింగ్‌!

Jan 30 2025 6:35 PM | Updated on Jan 30 2025 7:12 PM

Minister Uttam Kumar Reddy Serious On Irrigation Dept Officials

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇరిగేషన్‌ శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు ఉత్తమ్‌.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇరిగేషన్‌ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆయన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంతో ఇంజనీర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఫోన్‌ చేసిన ఉత్తమ్‌.. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. అయితే, పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు తోసిపుచ్చుకున్నారు జిల్లా అధికారులు. దీంతో​, అధికారులపై మంత్రి ఫైరయ్యారు. సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్‌ ఆఫీస్‌కు రావాలని ఈఎన్‌సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలోనే పనులు జరగకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు.. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచడమే కాకుండా.. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాజకీయంగా నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని నేను. కేబినెట్ విస్తరణ సీక్రెట్.. ఇప్పుడే చెప్పలేం. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభమని అన్నారు. ఇదే సమయంలో కేటీఆర్‌ అరెస్ట్‌పై మంత్రి ఉత్తమ్‌ స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డితో పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహిపాల్‌ రెడ్డి సెక్రటేరియట్‌గా వరుసగా మంత్రులను కలవడం ఆసక్తికరంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement