
వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరి ధ్యానం కొనుగోళ్లలో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. యాసంగి పంట ద్వారా 70 లక్షల మెట్రిక్ టన్నులు ధ్యానం దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. అకాల వర్షాలు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
దేవాదుల ప్యాకేజ్ 3 లోని దేవన్న పేట పంప్ హౌస్ లో ఒక మోటార్ ద్వారా నిరంతరాయంగా ధర్మసాగర్ రిజర్వాయల్ లోకి నీటిని ఎత్తి పోస్తున్నామన్నారు. త్వరలో మరో రెండు మోటర్లను ప్రారంభిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులు, సివిల్ సప్లై పంపిణీ తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు ఉత్తమ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల సంసిద్ధతపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పర్యవేక్షించి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.