పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు 

Minister Puvvada Ajay Kumar At Kalyana Lakshmi Cheques Distribution - Sakshi

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ 

64 మందికి రూ.6.40 కోట్ల చెక్కులు పంపిణీ 

ఖమ్మం మయూరిసెంటర్‌: పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్‌ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, తహసీల్దార్‌ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top