హైదరాబాద్‌లో భారీ వర్షం | Midnight Downpour in Hyderabad Nizamabad | Sakshi
Sakshi News home page

Midnight Downpour: హైదరాబాద్‌లో భారీ వర్షం

Jun 23 2026 12:32 AM | Updated on Jun 23 2026 12:32 AM

Midnight Downpour in Hyderabad Nizamabad

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌పురా, బీహెచ్‌ఈఎల్‌, పటాన్‌చెరు, మియాపూర్‌లో వాన కురిసింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు, నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పశువుల కాపరి పుట్టపాక మల్లయ్య(45) మృతి చెందాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement