
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5 వద్ద మెట్రో 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో రైల్లో రాయదుర్గం తరలించారు. ఈ మార్గంలో అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఇటీవల అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యలతో మెట్రో రైల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రోరైల్‌కు బ్రేకులు వేస్తున్నాయి.