నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కారు.. | Massive Road Accident at Gundrampalli Nalgonda District | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కారు..

Nov 8 2025 9:06 AM | Updated on Nov 8 2025 10:44 AM

Massive Road Accident at Gundrampalli Nalgonda District

నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా కారు.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉండగా.. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ధాటికి ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో చిట్యాల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement