TS Crime: Married Woman Commits Suicide in Nalgonda District - Sakshi
Sakshi News home page

Nalgonda Crime: కావ్యా.. ఎంత పనిచేశావమ్మా..

Mar 10 2022 3:55 PM | Updated on Mar 11 2022 1:20 PM

Married Woman Commits Suicide in Nalgonda District - Sakshi

శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. అత్తారింటి వేధింపులు భరించలేక కావ్య కొద్దిరోజుల క్రితం తల్లిగారింటికి వచ్చి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం కావ్య 5 నెలల గర్భవతి...

నల్గొండ (హాలియా) : అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన అనుముల మండలం  కొ ర్రివేనిగూడెంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాలియా ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొర్రివేనిగూడెం గ్రామానికి చెందిన సీతా లక్ష్మయ్య, వి జయ దంపతుల చిన్న కుమార్తె కావ్య(22)ను 7 నె లల క్రితం తిరుమలగిరి (సాగర్‌) మండలంలోని నేతాపురం గ్రామానికి చెందిన బొల్లెంపల్లి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమారుడు బొల్లెంపల్లి మహేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.2లక్షలు, ఆరు తులాల బంగా రం, అర ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సాఫీగానే సాగింది.  

కొద్ది నెలలుగా..
కొద్ది నెలలుగా కావ్యను భర్త మహేష్‌తో పాటు అత్తా, మామలు సూటిపోటి మాటలు అనడంతో పాటు ఆమెను అనునిత్యం అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. అత్తారింటి వేధింపులు భరించలేక కావ్య కొద్దిరోజుల క్రితం తల్లిగారింటికి వచ్చి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం కావ్య 5 నెలల గర్భవతి. అత్తింటి వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య ఈనెల 4న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆపస్మార క స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించా రు. అక్కడే చికిత్స పొందుతున్న కావ్య మంగళవా రం మృతిచెందింది. మృతురాలు తండ్రి సీతా లక్ష్మ య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement