Medak: నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు  | Man Swallowed Fish Bone Stuck in Stomach After 4 Years Removed | Sakshi
Sakshi News home page

Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు 

Dec 31 2022 1:05 PM | Updated on Dec 31 2022 1:08 PM

Man Swallowed Fish Bone Stuck in Stomach After 4 Years Removed - Sakshi

శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన చేపముల్లు  

సాక్షి, మెదక్‌: ఓ వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేశాడు. అప్పటి నుంచి నరకయాతన అనుభవించిన సదరు వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ముల్లును తొలగించాడు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల కేంద్రానికి చెందిన సాయిలు నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లును మింగేశాడు.

దీంతో అప్పటి నుండి ఇబ్బంది పడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందాడు. 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో అతను మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హాం ఆస్పత్రిలో చూపించుకోగా సదరు వైద్యుడు సురేశ్‌ శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును బయటకు తీశాడు.  వైద్యవృత్తిలో ఇది చాలా అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement