బీడీఎల్‌ టెక్నికల్‌ విభాగం డైరెక్టర్‌గా మాధవరావు | Madhavrao As Director Of BDL Technical Department | Sakshi
Sakshi News home page

బీడీఎల్‌ టెక్నికల్‌ విభాగం డైరెక్టర్‌గా మాధవరావు

Jan 3 2023 2:12 AM | Updated on Jan 3 2023 8:31 AM

Madhavrao As Director Of BDL Technical Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార­త్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌గా రిటైర్డ్‌ కమోడోర్‌ ఎ.మాధవ­రావు సోమవారం బా­ధ్య­­త­లు స్వీకరించారు. బీడీఎల్‌ కంచన్‌బాగ్‌ యూనిట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మాధవరావు టెక్నికల్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. బీడీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్‌­అం­డ్‌డీ పనుల్లో ఆయన ముఖ్యులుగా ఉన్నా­రు.

బీడీఎల్‌లో చేరకముందు భారత నౌకా­దళంలో విధులు నిర్వర్తించారు. నౌకాదళంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కార్గిల్, పరాక్రమ్‌ ఆపరేషన్స్‌లో, భారత నేవీలోకి న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్స్‌ను విశాఖపట్నంలో ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. నావల్‌ డాక్‌యార్డ్‌ల ఆధునీకరణలోనూ మాధవరావుది ప్రముఖ పాత్ర. 

Advertisement
 
Advertisement
Advertisement